లక్ష్మీ శాస్థా
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.7
ఈ దినం .లక్ష్మీ శాస్థా గురించి చూద్దాము.
"ఏకాశ్యం ద్వినేత్రoచ స్వర్ణవర్ణం వరప్రదం
సింహాసనస్థితం దేవం దశ బాహుభిః సుశోభితం
శరచ్చక్రం పద్మం ఖడ్గం అభయం దక్షిణనేతృథం
శంఖం ధను: కేటయే పాత్రం వరదo దృత కారాంబుజం
స్వర్ణయజ్నోప వీతాంగం లక్ష్మిరూప ప్రభాకరం
దారిద్ర్య దుఃఖ నాశనాశ్యo ధ్యాయేత్సుశక్త్యాoశ దైవతం."
అందమైన వర్ఛస్సును, స్వర్ణమయనేత్ర ప్రకాశ వరప్రసాధితుడు, సింహాశన అదిష్టుండు, శరము, చక్రము, తామరపూవు, ఖడ్గము మొదలైన ఆయుధములు తన ఎడమ ఐదు చేతులయందు కల వాడును, శంఖం, విల్లు, డాలు, పాత్రము, వరదము అను వాటిని కుడిచేతిభాగమున కలవాడు, బంగారు జెందము ధరించి లక్ష్మీ దేవి వలే వెలుగొందుతూ భక్తుల దారిద్ర్యమును, దుఃఖమును పారద్రోలి శక్తిమంతమైన లక్ష్మీ శాస్త్త, పార్వతి అంశముతో భక్తుల గాచి, వారికి సంపదలు, ఐశ్వర్యము ను ప్రసాదించు చున్నాడు. నమామి శరణo లక్ష్మీ శాస్త శరణo! శరణo!శరణం!
***********
అయ్యనార్ అవతారం
తమిళనాడు లో తిరువంజిక్కుళo ను "పెరుమాక్కోదయర్" అను రాజు పరిపాలించు చుండెను. ఇతను చేరవంశ శివ భక్తుడు. ఇతను చేర మాన్ పెరుమాన్ అను పేరిట ప్రసిద్ధి గాంచి ఉండెను. శివభక్తుడైన " సుందరమూర్తి నాయనార్" గారికి ప్రియ మిత్రుడు. వీరిరువురు కలసి శివుడికి పూజలు సలిపెడి వాడు. నాయనార్ గారు తనకు కైలాసప్రాప్తి కలుగ చేయుమని ఆ భోళాశంకరుని నిత్యము ప్రార్థించేవాడు. ఒకనాడు పరమశివుడు తన గణా లను పంపి సుందరమూర్తి నాయనార్ను శ్వేత గజముపై వూరేగింపుగా కొని తెమ్మని పంపెను.
నాయనారు ఊరేగుతూ తన మిత్రుడు గురించి, అతను కూడా వచ్చిన బాగుండునని యోచించు చుండెను.
నాయనార్ కైలాస యాత్ర విన్న చేరమానుడు మిత్రుని వదిలి ఉండలేక ఒక గుఱ్ఱము పై నెక్కి నాయనార్ వెళ్లుట చూచి, తాను వెంట పోవలెనని, తలంచి తన గుఱ్ఱము చెవిలో శివ పంచాక్షరీ జపించెను. మంత్రం మహిమచే గుర్రం అతి శక్తి వంతమై, నాయనార్ కన్నా కొంచెము ముందుకు వెళ్లి తిరిగి వచ్చి నాయనార్ గారిని ముమ్మారు ప్రదీక్షణం గావించి అతనిని అనుసరించినది.
కైలాసమున నంది అడ్డగించి, పరమ శివుని ఆజ్ఞ సుందరమూర్తికి మాత్రమే నని, చేరమానును అడ్డగించెను. లోనకు వెళ్లిన సుందరమూర్తి నాయనార్ భక్తి మీర శివుని పరిపరివిధాల స్తుతించి, నమస్కరించి, తన స్నేహితుడికి కూడా దర్శనం ఇవ్వమని ప్రార్థించెను.
కైలాసనాథుని ఆజ్ఞ తో నందీశ్వరుడు స్వయముగా తానే రాజును శివుని వద్దకు తీసుకెళ్ళేను. రాజు తనివితీరా శంకరుని ధర్శించుకొనేను. ఆనందం ఉప్పొంగ ఆపరమ శివుడు, పార్వతీ సమేతముగా తన పుత్రులైన గణపతి, మురుగన్, శాస్త తో వుండు దృశ్యమును గాంచి ఆశువుగా ఈశ్వర అనుమతితో తాను రచించిన " తిరుకైలాయ జ్ఞానఉలా" అను తమిళ గ్రంథమును పాటగా పాడి వినిపించెను. తిరుకైలాయా అనగా కైలాసగిరి అనియు జ్ఞానాఉలా అనగా ఉత్సవ వూరేగింపు అని అర్థము.
తల్లి తండ్రుల నడుమ అమరివున్న హరిహర పుత్రుడు, అమితా నoదము చెంది, ప్రాచీనమైన ఆ గ్రంధము భూలోక వాసులు కూడా చదివి తరించాలని, దానిని భూలోకమున, తమిళనాడు లోని "తిరు ప్పిడయూర్' అను పుణ్యక్షేత్రమున వెలువరించ కోరెను. చేర మానుడు తమిళ ప్రజలకు అర్థమగు రీతిన దానిని వెలువరించెను.
చేతిలో ఘంటము తో అవతరించి అయ్యనార్ గా పరమశివుడు సదా పూజలందుకొను చున్నాడు.
శ్రీధర్మశాస్తా వే శరణం
శరణం శరణం ప్రబద్దే!
ఇట్లు
మీ స్నేహితుడు
L . Rajeshwar