శని సింగనాపూర్ దేవుని దర్శించుకోండి
దశరథ కృత శని స్తోత్రం
దశరథుని తపస్సుకు మెచ్చిన శనైశ్చరుడు దశరథుడు కోరిన వరం ప్రసాదించి, మరో వరం కోరుకోమన్నాడు. అప్పుడు దశరథుడు “శనిదేవా! నేటి నుండీ మానవులను ఎవ్వరినీ మీరు బాధించవద్దు” అని వరం కోరుకున్నాడు. అప్పుడు శనిదేవుడు ''అది సాధ్యం కాదు.. నువ్వు నన్ను స్తుతిస్తూ స్తోత్రం రచించు. అది పఠించినవారిని నేను బాధించను'' అని వరమిచ్చాడు. ఆ వరానికి అనుగుణంగా దశరథుడు రచించినదే ఈ శని స్తోత్రం.
ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రు జటాయ చ నమో విశాల నేత్రాయ స్థూలరోంచవై నమః
త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు.
శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని.. తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు.
(సేకరణ ) శివానంద ఆశ్రమం