Online Puja Services

కాంతిమల కొండపై జ్యోతి ప్రకాశించడానికి కారణం?

3.22.194.5
కాంతిమల కొండపై జ్యోతి ప్రకాశించడానికి మూడు కారణములు కలదు
 
 మొదటి కారణం :ధర్మ శాస్త ధర్మ మార్గాలలో ధర్మమైన సన్యాస ఆశ్రమాన్ని కాంతిమలపై ఆచరించి జ్యోతి రూపం దాల్చాడు. కనుకనే జ్యోతి కాంతిమల కొండపై ప్రకాష్ ఇస్తున్నది. 
 
 రెండవ కారణం : దైవాంశ సంభూతుడైన నిన్ను మళ్ళీ మళ్ళీ దర్శించుకునే భాగ్యం మా అందరకూ వందల దేశప్రజలకు భావి తరానికి చెందిన "పాండ్య వంశస్తులకు" అనుగ్రహించమని, అభ్యర్థిస్తాడు, మహారాజు.
 
 మణికంఠుడు శబరిగిరిపై మీరు నిర్మించబోయే దేవాలయానికి ఎదురుగా అనగా తూర్పు దిక్కున యున్న కాంతిమలపై మకర సంక్రాంతి, day జ్యోతి రూపంలో  మీ అందరకు కనిపిస్తాను. అని చెప్పి యున్నాడు, అప్పటి నుండి క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి   రోజున కాంతి మల పై జ్యోతి రూపంలో స్వామి దర్శనమిస్తున్నాడు.
 
మూడవ కారణం: ధర్మశాస్త భూలోకంలో చతురాశ్రమ ధర్మాలు మార్గాలనూ ఆచరించబడుతున్న అనే విషయాన్ని తెలుసుకున్న మేరుపర్వతం కాంచనాద్రి ధర్మశాస్త్రగూర్చి ప్రార్ధించింది. ఏమని ప్రార్థించింది? స్వామి తమరు భూలోకంలో చతురాశ్రమ ధర్మాలు మార్గాలను నాపై అనగా (మేరు పర్వతం పై) ఆచరించి నన్ను   'చరితార్థఒడిని' గావించండి, అని ప్రార్ధించింది.  మేరు పర్వతం యొక్క ప్రార్ధనను మన్నించిన ధర్మశాస్త సన్యాస ఆశ్రమాన్ని (మేరు పర్వతంపై అనగా కాంచనాద్రి) పై ఆచరించి "జ్యోతి స్వరూప"  అని ఆ మేరుపర్వతానికి చెందినదే కాంతి మలై. 

(కాంతి మలై మేరు పర్వతం) పైనుండి జ్యోతి రూపంలో దర్శనమిచ్చి మనందరికీ జన్మ చరితార్థం అనుగ్రహిస్తున్నాడు ఆ తారక బ్రహ్మ స్వరూపం ఈ మూడు కారణాల చేత కాంతిమలపై జ్యోతి ప్రకాశిస్తున్న అని తెలుస్తున్నది. 

* మేరు పర్వతాన్ని కాంచనాద్రి కాంతి మలై అంటారు*

శివుడే దర్మ శాస్త్ర అని వివరించిన ఆది శంకరులు శ్రీ శాస్తా నమస్కార పంచరత్న లో 5 వ శ్లోకంలో  భూత బేతాళ సంసేవ్యా  కాంచనాద్రి నీవాసినం...... అని కీర్తించి యున్నారు* శ్రీ మహాశాస్త్ర అష్టోత్తర శతనామాలు శివ స్వరూపుడైన శాస్త్రాన్ని "మేరుశృంగ సమసినో" అని వర్ణించింది.
మేరు పర్వత శిఖరం పై కూర్చున్న వాడా అని అర్థం)

L. రాజేశ్వర్ 
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha