స్వామి అనే పదం లోని విశిష్టత
స్వామి అనే పదం లోని విశిష్టత గూర్చి తెలుసుకుందాం.
భారతీయ సాంప్రదాయంలో భగవంతుడిని స్వామి అని పిలుస్తారు. సన్యాస ఆశ్రమ దశలో ఉన్న స్వాముల వారిని స్వామి అని, పంచేంద్రియాల పై ఆధిపత్యం సాధించిన వ్యక్తిని స్వామి అని, తనని తానుగా నియంత్రించు వ్యక్తిని కూడా* స్వామి అని, భగవత్భక్తులను భగవదారాధకులన *స్వామి అని సంబోధిస్తూ ఉంటాము. మరొక వ్యక్తిని గౌరవం గా పిలువ వలసిన సందర్భంలో, స్వామి అని పిలవడం కన్నా ఉన్నతమైన పదం మనకు లభించదు.
మన సనాతన ధర్మం, స్వామి అనే పదానికి చెప్పలేనంత విలువల్ని సమకూర్చి( శక్తివంతం) చేసింది.
అయ్యప్ప దీక్ష తీసుకున్న వ్యక్తి* స్వామి*గా సామాజిక చేత గౌరవించబడతాడు.
"అహం బ్రహ్మాస్మి" అనే వేదాంత సత్యాన్ని గ్రహించిన వానిలా "స్వామి" అనే భావాన్ని కలిగి యుండడము ఉంటుంది స్వామి అనే పదం.
ఈ విధంగా' స్వామి' అనే పదం లో ఉండే కొన్ని గొప్పతనం గూర్చి తెలుసుకుందాం. "స్వామి అంటే ఏమిటి" "శరణం అంటే ఏమిటి" "స్వామి శరణం అంటే ఏమిటి" అనే విషయాలను గూర్చి తెలుసుకుందాం.
"స్వామి" అంటే ఏమిటి?
స్వామి అంటే swam కలవాడు అని అర్థం, swam అంటే ఆత్మ అని అర్థం.. *ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం పరమాత్మ అంటే పరబ్రహ్మము అని పరబ్రహ్మము అంటే భగవంతుడు అని గ్రంథాలలో అర్ధాలు.
* స్వామి అంటే ఆత్మ స్వరూపుడైన భగవంతుడిని హృదయంలో నిలుపుకున్న వాడు అని అర్థం**
* శరణం అంటే ఏమిటి. స్వామి శరణం అంటే ఏమిటి తెలుసుకుందాం.
శరణం అంటే నమస్కారము అని శరణు వేడుట అని అర్థాలు స్వామి శరణం అంటే ఏమిటి *ఆత్మ స్వరూపుడైన భగవంతుని నిరంతరం హృదయంలో నింపుకున్న మీకు నమస్కారం *అని అర్థం.
స్వామియే శరణం అయ్యప్ప అనే పదాన్ని గూర్చి తెలుసుకుందాం.
"స్వామి శరణం" శరణం అయ్యప్ప" స్వామియే శరణం అయ్యప్ప" అనే పదాలు స్వామివారికి సంతోషాన్ని కలిగిస్తాయి భక్తులకు పారవశ్యాన్ని కలిగించి కొండంత అండనిస్తాయి.
"స్వామియే శరణమయ్యప్ప" అనే మూడు పదాల లో ఉచ్చారణ మాధుర్యము, శబ్ద సౌందర్యం లతో బాటు "శరణాగతి" ఉంది హృదయపూర్వకంగా భగవంతుడిని శరణు వేడుట యున్నది.
(స్వామియే శరణం అయ్యప్ప) అన్న పదానికి గల అర్థాలను తెలుసుకుందాం.
స్వామియే అంటే* ఓ భగవంతుడా* అని "శరణం అంటే రక్షించు" అని" అయ్యప్ప అంటే తండ్రి" అని స్వామియే శరణమయ్యప్ప అంటే "ఓ భగవంతుడా రక్షించు తండ్రి" అని అర్థం.
"స్వామియే శరణం అయ్యప్ప" అన్నది "తారక మంత్రం" తారక మంత్రం"అంటే తరింప చేయు శక్తివంతమైనది అని అర్థం"
స్వామియే శరణమయ్యప్ప" అని తారకమంత్రం అలవాటయితే ఏం లాభం కలుగుతుంది.
నియమ నిష్టలతో క్రమం తప్పకుండా శబరీ శివుని సేవించి అయ్యప్ప భక్తులకు స్వామియే శరణం అయ్యప్ప అనే తారక మంత్రాన్ని మాటమాటకు పలకడం అయినప్పుడు ఆ భక్తుల హృదయాలలో మలినాలన్నీ తొలగించబడతాయి. ఆ తరువాత అలజడి లేని, శాంతా, చిత్తము, ఏర్పడి భక్తి పారవశ్యం కలుగుతూ ఉంటుంది. అట్టి భక్తి పారవశ్యం కలిగిన ఆ భక్తుని చుట్టూ ఎన్ని ఆకర్షణలు ఉన్నప్పటికీ వానిచే ఆకర్షింపబడకుండ భక్తిలో నిమగ్నమయ్యే అదృష్టం ప్రాప్తిస్తుంది. ఈ దశలో ఆ భక్తి బంధాన్ని భగవంతుడే సంరక్షించు కుంటాడు.
ఆ విధంగా భగవంతుని అనుగ్రహం కలిగినప్పుడు ఆ భక్తునికి అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది అటువంటి సిద్ది కలిగిన భక్తుడు స్వామియే శరణమయ్యప్ప అనే నామాన్ని మామూలుగా పలకడు.
(దీక్షతో పలుకుతాడు శ్రద్ధతో పలుకుతాడు భక్తితో పలుకుతాడు) ఇంతటి శక్తి ఎప్పుడైతే ఆ భక్తునికి కలుగుతుందో ఆ వెంటనే "కర్మ యోగ జ్ఞాన యోగ యోగ" మార్గము లన్నింటిని తనకు తెలియకుండానే తాను అధిగమించి స్వామితో నిత్య సంబంధం కలిగి ఉంటాడు.
అప్పుడా భక్తునికి, ఎరుకలో, నిద్రలో, నడక లో, paడక లో, జ్ఞానంలో, ప్రయాణంలో, మాటలో, మౌనం లో, చూపులో, చేష్టలు, మనసునిండా, అయ్యప్ప ఉంటాడు.
*అటువంటి భక్తి కలిగి ఉన్న భక్తుని నాలుకపై స్వామియే శరణం అయ్యప్ప అని తారకమంత్రం నిరంతరం నిలిచి ఉండేలా స్వయంగా * వ్రాసి వెళ్ళిపోతాడు.
అందుచేత స్వామియే శరణం అయ్యప్ప అని పేరు చూపి ఈ క్రింది విధంగా ప్రార్ధించు కొందాం.
* నా శరీరానికి నా జీవితానికి నా ఆత్మకు ఈ సమస్త ప్రపంచానికి అధిపతి అయినా ఓ భగవంతుడా *
(జననం నుండి మరణం వరకు సంభవించే బాధలనుండి నాకు విముక్తిని కలిగించిన నా లో ఉండే కామ క్రోధాది అరిషడ్వర్గాలను నికి చెందిన శత్రువుల నుండి నాకు విముక్తి కలిగించు నాకును నా వారికిని అజ్ఞానమును తొలగించి జ్ఞాన ప్రసాదించు ప్రతి జీవికి నిన్ను గూర్చిన భక్తిని అనుగ్రహించు భక్తి సామ్రాజ్యంలో చోటు కల్పించి నిన్ను దర్శించి జన్మ చరితార్ధం చేసుకునేలా శక్తినిచ్చి కాచి రక్షించు తండ్రి స్వామియే శరణం అయ్యప్ప) .
స్వామియే శరణం అయ్యప్ప శరణం.
L. రాజేశ్వర్