ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం
ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం
పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముందు నేలపైన బుట్టలలో నానారకములైన పళ్ళు ఆన్నీ ఉన్నాయి. నాకు గుర్తున్నంతవరకూ అది పురట్టాసి (ఆశ్వీయుజ) మాసం.
ఒక చిన్న అమ్మాయి అక్కడ ఉన్న గుంపు చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. మహాస్వామి వారు ఆ పిల్లని పిలిచి “ఇక్కడున్న పళ్ళల్లో నుండి నీకు నచ్చిన ఒక పండు తీసుకో” అని అన్నారు. అక్కడున్న బుట్టల్లో పైనాపిల్, ఆపిల్, ద్రాక్ష, జామ, కమలాలు ఉన్నాయి. కాని ఆ పిల్ల “నాకు మామిడీ పండు కావాలి” అని అడిగింది. అది మామిడి పళ్ళ కాలం కాదు. మామిడి చెట్లకు పిందెలు కూడా కాచే కాలం కాదు.
మహాస్వామి వారు ఆలోచనలో పడ్డారు. “వేదపురీ! మామిడి తాండ్ర ఏమైనా ఉన్నదేమో మెట్టూర్ స్వామి దగ్గర కనుక్కో” అని అన్నారు. తరువాత వారు ధ్యానంలోకి వెళ్ళారు.
రెండు నిముషాల తరువాత ఆంధ్రదేశం నుండి పండ్ల బుట్టి చేత పట్టుకొని ఇద్దరు భక్తులు వచ్చారు. ఆ పళ్ళెంలో రెండు పెద్ద మామిడి పళ్ళు ఉన్నాయి.
మహాస్వామి వారు కళ్ళు తెరిచారు. వారు ఆ చిన్నపిల్లని పిలిచి “వాటిని తీసుకో” అని చెప్పారు. ఆ పిల్ల ఆ పళ్ళనుండి ఒక మామిడి పండుని తీసుకొనింది. వేదపురి తిరిగి వచ్చి “మామిడి తాండ్ర కూడా లేదు” అని చెప్పి, ఆ పిల్ల చేతుల్లో ఉన్న మామిడి పండుని చూసి ఆశ్చర్యపోయారు.
“అరెరె! ఈకాలంలో మామిడి పండు ఎలా వచ్చింది?” అని మహాస్వామి అడిగారు. పొంగుకొస్తున్న భావోద్వేగంతో కళ్ళ నీరు కారుతుండగా వేదపురి మహాస్వామి వారితో “పెరియవ మామిడి పళ్ళ గురించి తలచుకున్నారు. అవి వచ్చాయి” అని అన్నారు.
పరమాచార్య స్వామి వారి శక్తి ఎంతటిదో మా కళ్ళారా చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది. కాని తరువాత చూస్తే ఆ పళ్ళను ఆ తెలుగు వారు మాకు ఎక్కడా కనపడలేదు. బహుశా మా మాంస నేత్రాలకు కనపడని చోటికి వెళ్ళీపోయారెమో!!!
--- రాధా రామమూర్తి, పుదుకొట్టై - మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి