Online Puja Services

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా ????

3.142.245.16
సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా ????
అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం ......
 
గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి.
 
ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి.
 
ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.
 
“దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!
 
ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము.
 కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.
 
దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -
 
ప్రత్తివత్తుల దీపారాధన:- దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును.
 
అరటినార వత్తుల దీపారాధన:- కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -
 
తామరతూడు వత్తుల దీపారాధన: - ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -
 
జిల్లేడు వత్తుల దీపారాధన :- విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -
 
పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల దీపారాధన: -  అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది. -
 
కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన :- దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది. -
 
పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన-: లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.
 
స్వస్తి......
 
**సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః**
 
- ప్రసాద్ సింగ్ 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha