అయ్యప్ప దీక్షలో గురువు
"గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః “
గురువు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
పరబ్రహ్మ స్వరూపమే ఈ భూప్రపంచంలో గురువుగారిగా అవతరించి ఈ అయ్యప్ప దీక్షలో శ్రేష్టుడిగా ఉండి గురు స్వరూపంగా దర్శనమిస్తున్నారు . ఈ ప్రపంచంలో ఏ ప్రాణి పుట్టుకతోనే ఏ తెలివి తేటలు కలిగి ఉండదు . గురువు గారి ద్వారా సమస్త విషయాలను అవగతం చేసుకొంటూ ఆయన అనుగ్రహం సిద్ధించుకొని , పరిపూర్ణత్వం పొంద గలగడం జరుగుతుంది.
" తివిరి యజ్ఞానతిమిర ప్రదీప మగుచు, నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించి
భరిత సత్త్వుండు సత్కర్మ నిరతుఁ డతుల, భూసురశ్రేష్ఠుఁ డలఘుండు బుధనుతుండు. "
భాగవతములో జగద్గురువైన శ్రీకృష్ణుడు గురువు సాందీపుని గురించి చెప్పిన మాటలు ఇవి . అజ్ఞానమనే చీకటిని పటాపంచలు చేసి జ్ఞానము యివ్వకలిగిన గురువు లేకపోతే భగవంతుని ఆస్తిక్యము తెలియదు.
" గురువు లేని విద్య గుడ్డివిద్య .“
ఈ ప్రపంచంలో ఎవరికైనా గురువు లేకపోతే జీవితమునకు పరిపూర్ణత సిద్ధించదు.
ధర్మశాస్త్ర వైపు మనలను మళ్ళిస్తారు . మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని జ్ఞానము ద్వారా తెలియచేస్తున్న గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనము చెయ్యడము తప్ప ఏమిచ్చినా మన ఋణము తీరదు. ఇంతటి గొప్ప గురువుని "అయ్యప్ప దీక్షలో" మనకు ఇచ్చిన ధర్మశాస్త్ర kuఏమి ఇవ్వగలము ? వారు నేర్పిన మాటలనే మాలలుగా సమర్పిస్తూ మనః పూర్వకముగా ప్రణామములు తప్ప!
నేటి swamulu కూడా ఎంతో ఆసక్తిగా సనాతన ధర్మ అనురక్తులై అందరికీ మంచి నడవడి నేర్పి ఇతిహాసములు, పురాణములు, ధర్మశాస్త్రములు, ఆది గురువు శంకరాచార్య, కంచి పరమాచార్య వారు బోధించిన ఎన్నో విషయముల సారమును అందించి అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని ధర్మమును పాటించాలని, విశ్రాంతి లేకుండా, అమోఘమైన వాగ్వైభవముతో మంచి విషయములు తెలియచేస్తున్నారు .
అయ్యప్ప దీక్షలోశిష్యులకు భక్తి, జ్ఞానము అనే రెండు రెక్కలను ప్రసాదించి అంతటా నిండి ఉన్న పరబ్రహ్మము వైపు ప్రయాణము చెయ్యకలిగిన స్థితిని, తమ స్పర్శచేత యివ్వ కలిగిన గురువు గారి యొక్క పాదములను ధ్యానము చేసుకోవడం అంటే" పరబ్రహ్మమును ధ్యానము" చెయ్యడమే .
గురుస్వాముల నోటి వెంట వచ్చిన మాటలు కాలముతో సంబంధము లేకుండా ఎప్పటికీ అలా నిలబడి ఉంటాయి.. గురువైన పూజ్యగురువుల వాక్కు మనకు శిరోధార్యము .
“ గురువు అంటేనే గురి . అంటే మన దృష్టిని అనవసరమైన విషయాల నుంచి , అవసరమైన ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్ళించి అక్కడ నిలబెట్టగలగటమే . అంతటి సామర్ధ్యం ఒక్క గురువు గారికే ఉంటుంది .”
వారు చెప్తున్న మంచి విషయములను అయ్యప్ప దీక్షలో ధర్మశాస్త్ర చెప్పినట్టుగా భావించి ప్రతివారు నమ్మకముతో, విశ్వాసముతో, సంతోషముతో, అనురక్తితో, అదృష్టముగా భావించి , ఆ మార్గంలో అడుగులు వేస్తూ , వారికి , వారిని కన్న దేశము యొక్క సర్వోన్నత వృద్ధికి కారణము అవుతున్నారు.
గురువు గారు ,ధర్మశాస్త్ర ఒకేసారి ప్రత్యక్షమైతే గురువుగారికే ప్రథమ నమస్కారము ( ధర్మశాస్త్ర దర్శనము చేయించకలిగిన సిద్ధపురుషులు కనుక)
Swamy saranam Guruswamy....
ఎల్.రాజేశ్వర్