భూతాధిప శాస్తా
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.6
ఈ దినము శ్రీ భూతాధిప శాస్తా (ప్రత్యక్ష శాస్తా) గురించి చూద్దాం.
చిత్ర క్షుద్రాదిపాదా విషవిషమ దశాపాశా పైశాచ హర్తా
శత్రు క్షోభాది నానా దురితధర మాహారోగ సంహారా కర్తా
పేద్ర ప్రత్యక్ష భస్మ ప్రదాన విజయ శ్రీనిధి భూత ప్రత్యక్ష
నిత్యం మాన్ మాన సాబ్జే నివాసతు భగవాన్ నిర్మల జ్ఞానమూర్తి:
క్షుద్రమైన పిల్లి, శూన్యము, చేతబడుల వంటి క్రియలనుండి, విష పదార్థముల నుండి కాపాడువాడు, పిశాచములనుండి రక్షించువాడు, శత్రుబాధలు తొలగించువాడు, వ్యాధులను అరికట్టువాడు, విభూతి రూపదారి అయిన విజయ శ్రీ భూతనాథుడు, నిత్యము నా మనస్సు నందు నలిచివుండుగాక. అమృతమథన సమయమున ఉద్భవించిన ఉచ్చ అశ్వం కల్పవృక్షం, కామధేనువు, నెలవంక, లక్ష్మీ, హాలా హలంతో పాటు ఇంకను ఎన్నియో మహిమలు గల వస్తువులు ఉద్భవించినవి. పిమ్మట సముద్రము నుండి పెక్కు భూతములు కూడా పుట్టెను. దేవ దానవులు భయముతో చేష్టలుడిగి పోయి నిలిచి పోయినారు. అంత ఈశ్వరుడు భూత నాథుని సృష్టించెను. ఆ శాస్తా యొక్క అంశంలో జన్మించినవాడే భూతనాథుడు. ఆ భూతములన్నింటిని అణచి వేసి దేవదానవులు రక్షించిన వాడే ఈ భూతాధిపశాస్తా.
భూతనాథుడు, భూతత్తాన్, అని కూడా పిలిచెదరు. శాస్థా భక్త వత్సలుడు. ఈ భూత నాథునికి దక్షిణాది దిశగా ఒక ప్రత్యేక దీపమును వెలిగించుట సంప్రదాయము.
ఎల్.రాజేశ్వర్