Online Puja Services

కిరాత శాస్త

3.129.249.170

హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.5.
 
***********
ఈ దినం  కిరాత శాస్త. గురుంచి తెలుసు కుందాము. 
 
 కాళాoబోద కలాయ కోమలతనుం ఫాలేoదుచూడం విభుo 
 బాలార్కయుధ రోచిష కర లసత్ కోదండ బాణంచితం 
 వీరశ్రీ రమణo రమణోత్ సుకమిష  రక్తాoబు భూషాoజలీo 
 కాలారి సీతం కిరాత వవుషం వందే పరదైవతం 
 
తా!!  సుందర మేని కలవాడు, నెలవoకను ధరించిన వాడు, సర్వవ్యాప్తియు, ఉదయభాను తేజుడు, విల్లoబుల ధారి, విజయలక్ష్మి ప్రసాదితుడు, వేటచే రక్తస్థితుడు, కాలారి అయిన శివ తనయుడు అయిన ఆ కిరాత రూపూడి ని ప్రార్థించు చున్నాను.
 
కొందరు ఎరిమెలి లో నెలకొన్న శాస్థా వేటగాడి రూపమున మహిషిని చంపినట్లుగాను, ఇంకొందరు అప్పటి మిగతా రాక్షసులను కిరాత రూపమున సoహరించునట్లు గాను చెబుతారు. ఎరిమేలి లోని శాస్తా ను కొందరు కిరాత శాస్త అంటారు.కొందరు, ఇది మహాభారత కాలమున జరిగినట్లుగా చెబుతారు.. పరమ శివుడు అర్జునునికి పాశు పతాస్త్రము అనుగ్రహించు నపుడు శాస్తా,  తండ్రి  వెంట కిరాత రూపమున వెళ్ళడము వలన కిరాత శాస్త గా పిలువబడెనట. అర్జునుడితో పంది సoహార తగవునందు శాస్తా అర్జునుడితో పొరు సలిపినట్లు కూడా  చెబుతారు. కానీ శివపురాణము నందు ఈ విషయం నిర్దారింప బడలేదు.
 
శాస్తా కిరాతరూపమున అచ్చటి రాక్షసులను వీరాది వీరుడుగా పోరాడి. సహరించినట్లు చెప్పబడినది.
ఇంకో విధముగా చూచిన, వేటగాండ్రు అడవిలోని క్రూర మృగములను వధింతురు. అవ్విధముగా, మన మనస్సు అను అరణ్యములో నెలకొని ఉన్న కామక్రోదాది క్రూరములను వేటాడి తరుముటకే ఎత్తిన అవతారమే ఈ కిరాతరూప శాస్థాగా కూడా భావిoప వచ్చును.

**********

 శ్రీ కిరాత రూప శాస్తా వే శరణం శరణం శరణం ప్రబద్దే 

ఎల్.రాజేశ్వర్

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore