Online Puja Services

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు

3.17.141.193
మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి ఇది చాల అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం 
 
మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు  
 
1.తల్లి 
మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి మనకు జననం  ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన  తల్లి మొదటి అద్భుతం 
 
2.తండ్రి 
మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని   తన కన్నీళ్లను దాచేస్తాడు  
మన పెదవులపై  చిరునవ్వును  చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 
దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం 
 
3.తోడబుట్టిన  వాళ్ళు 
మన తప్పులను  వెనుక ఏసుకురావాడానికి  
మనతో పోట్లాడడానికి  మనకు నేను ఉన్న అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు 
తోడబుట్టినవాళ్లు మూడో  అద్భుతం 
 
4.స్నేహితులు  
మన భావాలను  పంచుకోడానికి  
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి 
ఏది ఆశించకుండా  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం 
 
5.భార్య /భర్త 
ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను ఎదిరించేలా  చేస్తుంది 
కలకాలం తోడు ఉంటూ ఇన్నిరోజులు  తోడు ఉన్న అన్ని బంధాలకంటే  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  
భార్య/భర్త అర్థం చేసుకునేవారు  దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం 
 
6.పిల్లలు 
మనలో స్వార్థం మొదలవుతుంది  
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది  
వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి  
వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది 
వారికోసం ఏదో ఒకటి త్యాగం చేయని  తల్లి తండ్రులు  అసలు ఉండరు  
పిల్లలు ఆరో అద్భుతం 
అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా 
 
7.మనవళ్ళు మనవరాళ్లు
వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది  
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును  మరిచి 
మళ్ళీపసిపిల్లలం అయిపోతాం  
వీరు మన జీవితానికి  దొరికిన ఏడో అద్భుతం 
 
ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం  
 
 
నువ్వు వొచ్చినపని ఇంకా మిగిలి వున్నది అప్పుడు ఏదైనా  ఉన్నదా అన్న ప్రశ్న వొస్తే !..(అదయినా ) ముక్తి కోసం నీవు జీవం పోసుకున్న నాటినుండి నన్ను తలచిన ? తలవకపోయిన ప్రతీ ..ఘడియ నీవెంట నేనున్నాను ని .. ఆనందంలో నిన్ను నువ్వు గా .. నన్ను గ్రహించలేకపొయావు నువ్వు చుసిన ప్రతి అద్భుతంలో నేనయి వున్నాను ! అన్నది మరిచావ్ అంతే !
 
 
కాసింత ప్రేమ చాలు ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి
 
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha