Online Puja Services

కేదార్నాథ్ శివుని మహత్యం

18.117.230.37
కేదారనాథ్ ని ‘జాగృత మహాదేవుడు’ అని ఎందుకు అంటారు? రెండు నిముషాల ఈ కథ మిమ్మల్ని రోమాంచితం చేస్తుంది. *పూర్తిగా చదవండి-
 
ఒక సారి ఒక శివభక్తుడు తన ఊరినుండి కేదారనాథ్ ధామానికి యాత్రకోసం బయలుదేరాడు. అప్పట్లో యాత్రాసాధనాలు, ప్రయాణ సౌకర్యాలు లేనందున, అతడు నడక ద్వారానే పయనించాడు. దారిలో ఎవరు కలిస్తే వారిని కేదారనాథ్ మార్గం అడిగేవాడు. మనసులో శివుని ధ్యానిస్తూ ఉండేవాడు అట్లా నడుస్తూ నడుస్తూ నెలలు గడిచిపోయాయి
చివరకు ఒక రోజు అతడు కేదారధామం చేరనే చేరాడు.
 
కేదారనాథ్ లో మందిరం ద్వారాలను ఆరు నెలలే తెరుస్తారు, ఆరు నెలలు మూసి ఉంచుతారు. అతడు మందిరం ద్వారాలు మూసేవేళ అక్కడకు చేరాడు 
 
పూజారికి అతడు ఆర్తితో చెప్పాడు ‘నేనెంతో దూరం నుంచి పాదయాత్ర చేస్తూ వచ్చాను కృప ఉంచి తలుపులు తీయండి. ఈశ్వరుని దర్శించనివ్వండి’ అని. 
 
కానీ అక్కడ నియమం ఏంటంటే ఒకసారి తలుపును మూస్తే ఇక మూసినట్టే. నియమం నియమమే, మరి అతడు చాలా దుఃఖపడ్డాడు మాటిమాటికీ శివుని స్మరించాడు. 
 
‘ప్రభో, ఒకే ఒక్కసారి దర్శనం ఇవ్వవా'? అని అతడు అందరిని ఎంత ప్రార్థించినా, ఎవరూ వినలేదు
 
పూజారి అన్నాడు కదా ‘ఇహ ఇక్కడకు ఆరు నెలలు గడిచాక రావాలి, ఆరునెలలయ్యాకే తలుపును తెరిచేది’ అని ‘ఆరు నెలలపాటు ఇక్కడ మంచు కురుస్తుంది’ అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళిపోయారు. 
 
అతడక్కడే ఏడుస్తూ ఉండిపోయాడు, ఏడుస్తూ ఏడుస్తూ రాత్రి కాసాగింది. నలుదిక్కులా చీకట్లు కమ్మిపోయాయి కానీ అతడికి విశ్వాసం తన శివుని మీద  ఆయన తప్పక కృప చూపుతాడని. 
అతడికి చాలా ఆకలి దప్పిక కూడా కలగసాగాయి 
 
అంతలోకి అతడు ఎవరో వస్తున్న శబ్దాన్ని విన్నాడు చూస్తే ఒక సన్యాసి బాబా అతని వైపు వస్తున్నాడు ఆ సన్యాసి బాబా అతడి వద్దకు వచ్చి దగ్గరలో కూర్చున్నాడు. 
 
అడిగాడు ‘నాయనా, ఎక్కడినుంచి వస్తున్నావు?’ అని 
 
అతడు తన కథంతా చెప్పాడు. చెప్పి, ‘నేను ఇంత దూరం రావటం వ్యర్థం అయింది బాబాజీ’ అని బాధపడ్డాడు. బాబాజీ అతడిని ఓదార్చి, అన్నం తినిపించాడు, తరువాత చాలా సేపటివరకు బాబాజీ అతడితో మాట్లాడుతూండిపోయాడు బాబాజీకి అతడి పై దయ కలిగింది ఆయన ‘నాయనా, నాకు రేపుదయం మందిరం తప్పక తెరుస్తారని అనిపిస్తున్నది, నీకు తప్పక దర్శనం దొరుకుతుందనిపిస్తున్నది’ అని అన్నాడు.
 
మాటల్లో పడి ఆ భక్తుడికి ఎప్పుడు కన్ను అంటిందో తెలియదు సూర్యుడు కొద్దిగా ప్రకాశించేవేళకు భక్తుని కళ్ళు తెరుచుకున్నాయి అతడు అటూ ఇటూ చూస్తే బాబాజీ చుట్టుపక్కల ఎక్కడా లేడు అతడికి ఏదైనా అర్థమయ్యేలోపు పూజారి తమ మండలి అంతటితో కలిసి రావటం చూశాడు అతడు పూజారికి ప్రణామం చేసి అన్నాడు. 
  
'నిన్ననేమో మీరు మందిరం ఆరునెలలాగి తీస్తామన్నారు కదా? ఈ మధ్య సమయంలో ఎవరూ ఇటు తొంగి చూడరని కూడా చెప్పారు కదా, కానీ మీరు ఉదయాన్నే వచ్చేశారే’ అని అన్నాడు.
 
పూజారి అతడి వంక పరిశీలించి చూస్తూ, గుర్తు పట్టటానికి ప్రయత్నిస్తూ, అడిగాడు  ‘నువ్వు మందిరం ద్వారం మూసేసే వేళకు వచ్చినవాడివే కదా? నన్ను కలిశావు కదా ఆరునెలలయ్యాక తిరిగి వచ్చావా!’ అని అన్నాడు.
 
అప్పుడు ఆ భక్తుడు అన్నాడు ఆశ్చర్యంగా – ‘లేదు, నేనెక్కడికీ పోనేలేదే నిన్ననే కదా మిమ్మల్ని కలిసింది, రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను నేనెటూ కదలలేదు’ అని చెప్పాడు.
 
పూజారికి ఆశ్చర్యానికి అంతే లేదు ఆయన అన్నాడు  ‘కానీ నేను ఆరునెలల ముందు మందిరం మూసి వెళిపోయాక ఇదే రావటం నీవు ఆరు నెలలు పాటు ఇక్కడ జీవించి ఎట్లా ఉండగలిగావు?’ పూజారి, అతడి బృందం అంతా విపరీతంగా ఆశ్చర్యపోయారు.
 
ఇంత చలిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఆరునెలల పాటు జీవించి ఎట్లా ఉండగలడు?
 
అప్పుడు ఆ భక్తుడు ఆయనకు ఆ సన్యాసి బాబా రావటం, కలవటం, ఆయనతో గడిపిన సమయం, విషయం అంతా వివరించాడు ‘ఒక సన్యాసి వచ్చాడు- పొడుగ్గా  ఉన్నాడు, పెద్ద గడ్డం, జటలు, ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో డమరుకం పట్టుకుని, మృగచర్మం కప్పుకుని ఉండినాడు’ అని.  
వెంటనే పూజారి, ఇతరులు అందరూ అతడి చరణాలపై పడిపోయారు ఇట్లా అన్నారు  ‘మేము జీవితమంతా వెచ్చించాము, కానీ ఈశ్వరుని దర్శనం పొందలేకపోయాము, నిజమైన భక్తుడివి నీవే నీవు సాక్షాత్తు భగవంతుడినే, శివుడినే దర్శనం చేసేసుకున్నావు ఆయనే తన యోగమాయతో నీకు ఆరునెలలు ఒక రాత్రిగా మార్పు చేసేశాడు కాలఖండాన్ని తగ్గించి చిన్నగా చేసేశాడు ఇదంతా నీ పవిత్రమైన మనస్సు, శ్రద్ధ విశ్వాసాల కారణంగానే అయింది మేము నీ భక్తి కి ప్రణామాలు అర్పిస్తున్నాము..
 
.ఓం నమఃశివాయ
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha