ధర్మశాస్తా కథలు. సీరియల్.నం. 2
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం. 2 కాలశాస్తా
శ్రీధర్మశాస్తా మహిషి అనే రక్కసిని సంహరించారు...
*అంతే.మనకందరికీ తెలిసినది కానీ వారి లీలలు అనేకం కలవు. స్వామి ఇతర రాక్షసులు, దేవతలను రాజులను కూడా శిక్షించినారు. రోజుకో లీలను చదువుకుందాము.
యమునికే యముడు:-
భక్తి తో పాటు ధర్మ నిలయమైన నేపాల్ దేశమున పూర్వము సోమశర్మ అను బ్రాహ్మణ భక్తుడొకడు వుండే వాడు. అతడి భార్య పేరు సుకళ. కొడుకు కళాధరుడు. జాతక రీత్యా కళాధరుడి ఆయుష్షు 12 సంవత్సరములు మాత్రమే.
బాలుడి తల్లి తండ్రుల కు అధిక తీరని ఆవేదన. సోమశర్మ కుమారుడికి ఉపనయనం గావించి, అతనికి మహశాస్తా మూలమంత్రమును ఉపదేశించెను. కళాధరుడు అనునిత్యం మంత్ర జపము నిష్ఠతో చేసేవాడు.
ఒక నాడు భృగు మహర్షి వారింటికి వచ్చారు. అతిధి సత్కార్యాలు గావించి సోమశర్మ వారికి తన పుత్రుని జాతక దోషము గురించి చెప్పెను. మార్గము చూపుమని వేడుకొనెను. సంతుష్టుడైన భృగు మహర్షి వారికి శాస్తా యొక్క శనివారవ్రతము గురించి చెప్పి, భక్తిగా ఆచరించిన, వారి దుఃఖకారణము తప్పక తొలగును అని ఉపదేశించారు. వారు ఆ వ్రత వృత్తాoతము నెరింగిన వారై, భక్తి శ్రద్ధలతో ఆచరించ సాగారు.
బాలుడికి 12 ఏళ్ళ వయస్సు వచ్చినది. కళాధరుడు ఎప్పటివలె నియమ నిష్టలతో మహాశాస్తా ను కొలుచుచుండెను. విధి నిర్వహణా ధర్మ బద్ధుడు యమధర్మరాజు కళాధరుని ప్రాణములు హరింప వచ్చెను. అపుడు బాలుడు శాస్త్ర జపంలో నున్నాడు. యముడు అది గమనింపక, కళాధరుడు పై పాశo విసిరాడు.
అంతే! మార్కండేయుని కాపాడిన ఆ పరమేష్టి పుత్రుడు తన భక్తుడిని యమపాశానికి బలి కానిచ్చునా! శాస్తా రౌద్రుడైనాడు.
నల్లని దట్టమైన కురులు, నల్లటి కారుమేఘo లాంటి మేని ఛాయతో, దండము, అంకుశము, పాశము, శూలము లతో కాలశాస్తా రూపమున, యముడికే భయం గోలుపు రీతిన ప్రత్యక్షమై తనపాశాన్ని యమునిపై వేసెను. అమరుడు అయిన యముడు మూర్ఛిల్లెను.
ప్రత్యక్షంగా చూసిన సోమశర్మ. దంపతులు ఆనందంగా, భయ భక్తులతో శాస్తాను పొగిడారు. శనివారం వ్రతమాచరించిన వారిపట్ల సంతుష్టుడైన శాస్తా వారి పుత్రునికి పరిపూర్ణ ఆయుష్షు నిచ్చి, వారికి సకల సుఖశాంతులతో వర్థిల్లగలరని, వారికి, వార్రి సంతతికి కూడా ఉత్తమ గతులు ప్రసాదించి, అంత్యమున తన సన్నిధి చేరు మార్గమును సూచించెను.యమధర్మరాజు లేకపోవటంతో భూభారం అధికమాయెను. భూదేవి భారం మోయలేక బ్రహ్మకు మొరలిడెను. బ్రహ్మ శాస్తాలోకము నకు వెళ్లి , భూదేవి భూభారం తీర్చుమని శాస్తాను పరిపరి విధముల ప్రార్థించి, యముని పునర్జీవిగా చేయుమని వెడుకొనెను.
కరుణాసాగరుడు శాస్తాను పునర్జీవీతుని చేసెను. యమధర్మరాజు తన తప్పిదనాన్ని మన్నించమని శాస్తాను వేడుకొనెను. అపుడు శా స్తా యముడితో, "యమధర్మరాజా! చావు పుట్టుక మానవులకు సహజం. నీ ధర్మము నీవాచరించవలె. అది తప్పదు. కానీ నాయందు భక్తితో నున్న నా భక్తులను బాధింపకుము. వారు సదా నా అనుగ్రహమునకు పాత్రులై వుంటారు."- అని హెచ్చరించి యముని పంపివైచెను.
కొoత కాలం తరువాత ఈ విషయం తెలియని, యముని మంత్రి - కాలుడు అనునతడు ఒక పొరపాటు చేసెను. , మరణ సమయమున అనుకోకుండా శాస్తా నామము ఉచ్చరించుటచే ఒకడి పాపములన్నియు తొలిగిపోయియినది. అది తలంచక కాలుడు, వాడి ని కొనిపోవ తన భటులతో వెళ్లి శతవిధాల ప్రయత్నించెను. ఇది తెలిసిన స్వామి ప్రధాన గణాధిపతి అయిన మహాకాలుడు శివగణములను అతడి పైకి పంపి, యమ దూతలను తరిమివేసి, కాలును బట్టి పాతాళ గుహలో బంధించెను.
విషయం తెలిసిన యమధర్మరాజు నంది వద్దకు వెళ్లి తన మంత్రు కాలుడును చెర విడిపించ మని కోరగా, నందీశ్వరుడు ఆపని తన వల్లకాదని, బంధించినది శాస్తా యొక్క సేనాధిపతి. కనుక మీరు వెళ్లి మహాకాలుడుని క్షమాపణ కోరి,అతడిని పిలుచుకొని వెళ్ళండి, అని సలహా ఇచ్చెను.
అంత యమధర్మరాజు, మహాకాలుడి వద్దకు వెళ్లి క్షమాపణ కోరగా, ముందు జరిగిన పరాభవమును మరచితివా? అని గుర్తు చేసి ఒక శివగణమును పంపి చెర విడిపించగా, కాలుడు, యమధర్మ రాజు మహాకాలుడి కి నమస్కరించి వెళ్లి పోయినారు. కాలుడు, యమ ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలుప "నీవు అప్పుడే నీవు శివగణములను చూడగానే వెనుకకు వచ్చి వుండవలసినది, ఎన్నడూ శివ, పార్వతి, వినాయకుడు, స్కందుడు, మహశాస్తా, భైరవ, వీరభద్ర, నoది, మహాకాలుడు, వృషభరాజు, వీరిభక్తుల వద్దకు నేనే వెళ్ళను, నీవు ఇకపై జాగ్రత్త, వారివద్దకు కూడా పోవలదు అని చెప్పెను.
శ్రీధర్మశాస్తా వే శరణం
శరణం శరణం ప్రబద్దే!
సేకరణ
ఎల్.రాజేశ్వర్
ఎల్.రాజేశ్వర్