Online Puja Services

హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు సీరియల్ నo.1

18.117.230.37
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు
 సీరియల్ నo.1 
 
 
  ప్రతి దినము తెలుపుతాను. కేవలం కథలు గా మాత్రమే చదువుకోనండి. కానీ దయచేసి ఆదారాలు  అడుగవద్దు. నావద్ద ఎటువంటి ఆధారాలు లేవు. అప్పుడు తెలియక సేకరించలేదు. ఇవన్నియు నేను చదివినవి, విన్నది, తెలుసుకున్నవి మాత్రమే.

***********

హరిహర సంగమము వలన బాలుడు ఉద్భవించిన పిదప  శ్రీధర్మశాస్తాను భూలోకమున వదలి హరి, హరులు తమ లోకాలకు వెళ్లిపోయారు. కరుణ, జాలి, ప్రేమ లేక కాదు. దత్తాత్రేయుడు, లీలావతుల జన్మములకు సార్థకత చేయడం, వారి ఉద్దేశ్యం. మహిషి వధ అనివార్యం. అందులకు కావలసిన అర్హతలు, ఆ హరిహర తనయునికి మిక్కిలి అవసరం.జరుగవలసిన దానిని విధి తన పని తాను చేసుకుంటూ పోతుంది. విధికి మానవులైన, దానవులైన, దేవతావతారులైన ఒక్కటే. జన్మించడం అంటూ జరిగితే మరణించడం కూడా ఉండి తీరుతుంది. మనుషులు, దానవులు మరణిస్తే, దైవాoస సంభూతులు భూమి మీది నుండి నిష్క్రమిస్తారు. 

మీకందరికీ తెలుసు. రామావతారములో శ్రీరాముడు, సరయు నదిలో దిగడంతో సమాప్తం అవుతుంది. ఆయన కూడా రావణ బ్రహ్మహత్యా పాతకానికి విరుగుడుగా శివలింగాలను ప్రతిష్టించి పాప విముక్తుడై నిష్క్రమించాడు.

కృష్ణావతారంలో గీతాచార్యుడు తను చెప్పిన గీత లోని విషయాలకు అనుగుణంగా, శ్రీరాముడిగా 
వాలి ని చంపిన పాపమును (ముందు అవతారంలో  మిగిలి పోయినది), కృష్ణావతారం సమాప్తమునకు ఉపయోగించుకున్నాడు. అదే వాలి కిరాతకుడిగా జన్మించి, ఋషి శాప ముసలం ముక్కే-- బాణమై దేహత్యాగము చేసాడు.

హరిహర పుత్రుడు పుట్టుకతో కారుమబ్బు నల్లటి భీకర ఆకారముతో పుడతాడట. కారణం శివుడి కంఠములోని హలాహలము యొక్క వేడి తీవ్రత. అలా పుట్టిన బాలుడు ఒక కొండ గుహలో తల దాచుకున్నాడట. 

ఒక నాడు విఘ్నేశ్వరుడు వాహ్యాళిగా భూలోకం పైన వెళుతుండగా, భూమినుండి ఏదో తెలియని ప్రేమపాశం లాగినదట, క్రిందికి దిగి (మానవ రూపములో) వినాయకుడు భూమి మీదకు వచ్చారట. ఆ కొండ గుహ సమీపించు చుండగా లోనుండి తీవ్రమైన ఒక హెచ్చరిక, "లోనకు రావలదు" అని వినిపించినదట. వినాయకుడు బహు సుందర రూపము కల బాలుడు. ఆ బాలుడు తన రూపమును చూసి భయపడునని శాస్తా గణేశుని తనవద్దకు రానివ్వలేదట.

కానీ మాట వినని విఘ్నేషుడు తటాలున ఒక్క ఉదాటున శాస్తా చెంతకు చేరి,   ప్రేమ మీర ఆలింగనం చేసుకొనగా, శాస్తా వారు చక్కని ఆకర్షణీయమైన సుందర రూపము ధరించినారట. వినాయకుడు, తన జ్ఞాన దృష్టితో జరిగిన దంతా తెలుసుకొని, శాస్తాకు వివరించి, కైలాశమునకు పిలుచుకొని వెళ్లినారట.      దేవతలందరూ పరమానందం చెందినారు. అటుపిమ్మట జగత్పిత మాత, దేవతలు కలసి , మారులలో అగ్రగణ్యుడికి విఘ్నాధిపథ్యము, సుబ్రహ్మణ్యుడికి  సైన్యాధిపత్యము, శాస్తా కు ముల్లోకాలలోను ధర్మాన్ని పరిరక్షించు  భారపు  పధవులను కట్ట బెట్టి నారట. అప్పటినుండి  స్వామి శ్రీధర్మశాస్తా అయినారట. 

శ్రీ ధర్మశాస్తే వే శరణం శరణం శరణం ప్రబద్దే! 

సేకరణ
ఎల్.రాజేశ్వర్ 
 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha