Online Puja Services

తిరుపతి లోని అలిపిరి కి ఆ పేరు ఎలా వచ్చింది?

13.59.87.145
( శ్రీవారి మహిమలు - యదార్థ సంఘటనలు ) 
 
" తిరుమల " కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న " అలిపిరి " ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడినుంచి కాలినడకన లేదా రకరకాల వాహనాలలో మనం సప్తగిరుల పైకి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటాం. అయితే కొండ క్రింద ఉన్న ఈ    "అలిపిరి" కి ఆ పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు.అసలు " అలిపిరి " అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా ... ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ " అలిపిరి " అనే పదం లేదు.  

అయితే, " అలిపిరి " అనే ఈ పదం ఎలా పుట్టింది ... ? 

దీని వెనుక చరిత్ర ఏమిటి ... ?

అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం," తిరుపతి " నగరం ఇప్పటిలాగా లేదు.ఇప్పుడు " అలిపిరి " అని పిలుస్తున్న ప్రాంతానికి-"అలిపిరి" అన్న పేరు కూడా లేదు. మరి " అలిపిరి " అన్న పేరు ఎలా వచ్చిందో  పూర్తిగా చదివి తెలియనివారికి తెలియపరచాలని మా హృదయపూర్వక విజ్ఞప్తి.అది ( 1656 - 1668 ) ప్రాంతం . ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన " రాక్షసి తంగడి మరియు తళ్ళికోట " మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు. ఈ నిజాం నవాబు, ఢిల్లీ సుల్తానుకు - కప్పం కడుతూ సామంతుడిగా పడి ఉంటూ, హిందువులపై నిరాఘాటంగా, ధారావాహికంగా అకృత్యాలు, అరాచకాలు చేస్తూ ఉండేవాడు.
 
పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా - కుతుబ్ షా మరియు వజీర్ల సైన్యం, " ఆలీ " అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత " ఆలీ " సైన్యం తిరుపతికి చేరుకుంది.
 
అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం. ఇప్పుడు " మంచినీళ్ళ కుంట " అని చెప్పుకుంటున్న 
" నరసింహ తీర్థమే " అప్పటి తిరుపతి గ్రామం. ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని " నరసింహ తీర్థం రోడ్ " అనే పిలుస్తారు. ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు : 

</div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore

© 2022 Hithokthi | All Rights Reserved