నరకబాధలు లేకుండగా చేసే...కృష్ణనామస్మరణ.
హరే రామ హరే రామ...రామ రామ హరే..హరే..
హరే కృష్ణ హరే కృష్ణ...కృష్ణ కృష్ణ..హరే హరే..!!
జీవితంలో తెలిసో .. తెలియకో చేసే కొన్ని పనుల వలన పాపాలు ఖాతాలోకి చేరిపోతుంటాయి.
ఎవరి పాపాలు వాళ్ల జీవితాలను ప్రభావితం చేస్తుంటాయి.
ఇక కొన్ని పాపాలు జన్మజన్మల పాటు వెంటాడుతూ ఉంటాయి.
ఈ కారణంగా కూడా అనేక బాధలు ..కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.
ఆర్ధికంగా .. ఆరోగ్యపరంగా అనేక సమస్యలతో సతమతం చేస్తుంటాయి.
చేసిన పాపాల ఫలితంగా .. పాపాలకి తగిన శిక్షలను నరకంలో అనుభవించవలసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
నరకలోకంలో జీవుడు అనుభవించే బాధలు
అన్నీ ఇన్నీ కావు ..
అందువలన పాపాల నుంచి విముక్తిని పొందే మార్గమేదైనా ఉందా అని పరాశర మహర్షిని
మైత్రేయుడు అడుగుతాడు.
సమస్త పాపాల నుంచి విముక్తిని కలిగించేది
కృష్ణ నామస్మరణమని పరాశర మహర్షి చెబుతాడు. అందువలన అనునిత్యం శ్రీకృష్ణుడి నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
ఏ మాత్రం సమయం దొరికినా ఆ స్వామి క్షేత్రాలకి వెళ్లి దర్శనం చేసుకోవాలి.
ఇక శరీరం సహకరించనివారు శ్రీకృష్ణుడి లీలా విశేషాలను తలచుకుని అనుభూతిని చెందాలి.
శ్రీకృష్ణుడిని ఆరాధించి తరించిన భక్తుల జీవితచరిత్రలు చదువుకోవాలి ..
ఆ స్వామి పాదాల చెంత మనసును సమర్పించాలి.
జీవితంలో ఒక్కసారైనా మథుర ..బృందావనం .ద్వారక క్షేత్రాలను దర్శించి .. స్పర్శించి తరించాలి.
ధర్మ సంస్థాపన కోసమే అవతరించిన శ్రీకృష్ణుడు, ధేనుకాసురుడు .. ప్రలంబాసురుడు .. వృషభాసురులను సంహరించాడు.
'కేశి' అనే అసురుడిని .. కంసుడిని అంతం చేశాడు. అహంభావంతో తననే సవాలు చేసిన
పాండ్రక వాసుదేవుడికి సరైన సమాధానమిచ్చాడు.
'కుబ్జా' అనే త్రివక్ర వంకరలు సరిచేసి ఆమెకి అందమైన రూపాన్ని ఇచ్చాడు.
ధర్మాన్ని అంటిపెట్టుకుని .. తనని ఆశ్రయించిన పాండవులకు అడుగడుగునా అండగా నిలిచాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నిలబడి
వాళ్లకి విజయం చేకూరేలా చేశాడు ..
ఈ లోకానికి 'గీత'ను అందించాడు.
పేదరికంతో బాధపడుతోన్న చిన్ననాటి స్నేహితుడైన సుధాముడికి సిరిసంపదలను అనుగ్రహించాడు.
నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలనే విషయాన్ని
ఈ లోకానికి చాటి చెప్పాడు.
'గోవర్ధన గిరి'ని పైకెత్తి అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాడు. అలాంటి కృష్ణుడి నామాన్ని స్మరించడం వలన ..
ఆయన క్షేత్రాలను దర్శించడం వలన
సమస్త పాపాలు నశించి,
సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
స్వస్తి..!!