Online Puja Services

ద్వైతం, అద్వైతం మరియు విశిష్టాద్వైతం అంటే ఏమిటి ?

18.226.159.13
1 ద్వైతం అంటే ఏమిటి ?
2. అద్వైతం అంటే ఏమిటి ?
3 విశిష్టాద్వైతం అంటే ఏమిటి ?
.
1. (..ద్వైతం )
నీవు దైవం ; నేను జీవున్ని ..... నీవు గురువు , నేను శిష్యుణ్ణీ అన్నది ద్వైతం .
 
మధ్వాచార్యులు ప్రవచించిన మతం. జీవాత్మ, పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతుంది.
సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ.... కంటికి కనిపించని పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని, ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది.
.
2 ( అద్వైతం )
.
నీవు -నేను ఒక్కటే అన్నది అద్వైతం .
.
అద్వైతం అనగా భాషాపరంగా అర్థం "ద్వైతం"కానిది, జీవాత్మ, పరమాత్మల ఏకత్వ భావనే అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదిక. 
 
ఆది శంకరాచార్యులు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. శంకరుడు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం.
.
3 ( విశిష్టాద్వైతం )
.
నీవు దేవుడు
నేను జీవి
ప్రకృతి
పంచభూతాలు 
అన్నవి వేర్వేరు అయినా ఒకదానిలో ఒకటి మిలితమై అంతటా వ్యాపించి ఉంటాయి .
 
విశిష్టాద్వైతం అనేది 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించిన
వేదాంత దర్శనము.
 
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
 
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha