శ్రీవిల్లిపుత్తూరు : వటపత్ర శాయి.
శ్రీవిల్లిపుత్తూరు : వటపత్ర శాయి.
స్థల పురాణము: పెరియాళ్వార్, ఆండాళమ్మ జన్మ స్థలము. పెరియాళ్వార్ కి విష్ణు చిత్తార్ అని కూడా పేరు. ఈయన ఎంపేరుమాన్ నే తలుస్తూ ఉండేను. ఈయన పెరుమాళ్ పూల సేవ కొరకు ఒక ఉద్యానవనమును పెంచెను. ఈ ఉద్యానవనము నుండి పువ్వులు, తులసితో పూలమాలలు చేసి పెరుమాళ్ కి కైంకర్యము చేసేవారు. ఈయనకి ఒక దినమున ఉద్యానవనములో ఒక శిశువు దొరికెను. ఆ శిశువుకి ఆండాళ్ అని నామకరణము చేసి పెరుమాళ్ సేవలో ఆమెని పెంచెను.
ఒక రోజు పెరియాళ్వార్ ఎంపేరుమాన్ రంగమన్నార్ కి కైంకర్యము కొరకు ఉంచిన మాలని ఆండాళమ్మ వేసుకొనడము చూసి ఆమెను మందలించి వేరే మాలను కట్టి ఎంపేరుమాన్ కి కైంకర్యము చేసెను. ఆశ్చర్యముగా రంగమన్నార్ ఆ మాలని తిరస్కరించి , ఆండాళ్ అలంకరించుకున్న మాలనే పరిగ్రహించేను. రంగమన్నార్ పెరియాళ్వార్ స్వప్నములో ఆండాళ్ పుమాలలు అలంకరించుకున్నవే కైంకర్యము చేయమని ఆనతిచ్చెను.
ఆండాళ్ ని సూడి కుడుత నాచ్చియార్. పెరియాళ్వార్ వడ మధుర, తిరుమాల్రిన్ చొలై (అழఘర్ కోవిల్) లలో విష్ణుమూర్తి అందచందములు అతి సుందరముగా వర్ణించును. ఆండాళ్ శ్రీ విష్ణుమూర్తి నే వివాహమాడాలని నిశ్చయించి శ్రీ రంగనాధుడిని పై ఇచ్ఛ పెంచుకున్నది. ఒక రోజు పెరియాళ్వార్ కి స్వప్నము లో రంగనాధుడు ఆండాళ్ ని తనతో వివాహము కొరకు శ్రీరంగము గైకొనమని ఆనతిచ్చెను. పెరియాళ్వార్ ఆండాళ్ తో శ్రీరంగము వెళ్ళగా ఆండాళ్ ని శ్రీ రంగనాధుడు తనలో ఐఖ్యము చేసుకొనేను.
పెరియాళ్వార్ గరుడ అవతారము.
పెరియాళ్వార్ పూల తోట పెంచిన కాలములో వల్లభదేవ రాజు సెల్వనంభిని ఎవరు ముఖ్యమైన దైఁవము ఈ లోకములో అని ప్రశ్నించెను. సెల్వనంభి రాజ్యములో ఉన్న పండితోత్తములను పిలిచి ఎవరైతే సరి అయిన వ్యాజ్యము తో ముఖ్యమైన దైవమును నిరూపించురో వారికి స్వర్ణ నాణెముల సంచిని ఉంచిన కంభము వారి వద్దకు వంగును అని వారే ఆ స్వర్ణ నాణెములకు అర్హులు అని తెలియచేసేను. పండితోత్తములు ఎవ్వరూ సరి అయిన వ్యాజ్యము చేయలేక ఓటమి పొందిరి. పెరుమాళ్ పెరియాళ్వార్ స్వప్నములో వ్యాజ్యములో పాల్గొనమని ఆదేశించేను. విష్ణు చిత్తుడు వ్యాజ్యములో నారాయణుడే ముఖ్యమైన దైవమని రాజుకి సభా సధశ్యులకు విశదపరిచెను. ఆ కంభము పెరియాళ్వార్ వైపుకు వంగెను. విష్ణు చిత్తుడే వ్యాజ్యము లో విజేత అని రాజు చాటించి అతి సుందరముగా అలంకరించిన గజము పై ఊరేగింపెను. పేరియాళ్వార్ గజంపై ఊరేగిస్తున్నప్పుడు నీలాకాశములో పెరుమాళ్ పీతాంబరదారి అయి మహాలక్ష్మి సమేతముగా పెరియాళ్వార్ ని దీవించునకు ప్రత్యక్షమయ్యేను. పెరియాళ్వార్ (విష్ణు చిత్తర్) పెరుమాళ్ ని చూసి అత్యంత పరవశము తో పల్లాండు పల్లాండు 12 శ్లోకాలను పెరుమాళ్ కి దీర్ఘాయుషు మరియు నర దృష్టి లేకుండా కలగాలని ఆలపించేను. పెరియాళ్వార్ ని భట్టఫిరాన్, శ్రీ విల్లిపుత్తూర్ కోనే, పుదువై కోనే మరియు కిழி అరుత్తన్ అని పేరు. విల్లి మరియు పుట్టన్ ఈ గ్రామమును నిర్మించిరి అందువలన ఈ గ్రామమునకు శ్రీ విల్లిపుత్తూర్ అని పేరు. శ్రీ ఆండాళ్ పెరుమాళ్‌ని స్తుతించిన తిరుప్పావై 30 పాశురాలు ప్రతి వైష్ణవ ఆలయములందు ధనుర్మాసమందు పారాయణ చేయుదురు.
మూలవర్: వటపాత్ర సాయి, రంగ మన్నార్, తిరుక్కోలము : నిండ్ర తిరుక్కోలము :
మూలవర్: వటపాత్ర సాయి, రంగ మన్నార్, తిరుక్కోలము : నిండ్ర తిరుక్కోలము :
తిరుముగము: తూర్పు.
ప్రత్యక్షం: మండూక ఋషి మరియు పెరియాళ్వార్,
తాయార్: ఆరి ఆండాళ్ (కొత్త నాచ్చియార్, సూడి కుడుత సుదర్ కోడి,)
పుష్కరిణి: ముక్కల తీర్థం
విమానము: సంశన విమానము
ఆళ్వార్ మంగళాశాసనము: పెరియాళ్వార్: 133,పెరియాళ్వార్ తి.మొ. 2-2-6,ఆండాళ్:
549 నచ్చియార్ తి.మొ. 5-5,నాలాయిర దివ్య ప్రభందం పాశురముల పట్టిక ప్రకారం
తిరుప్పావై చరణములు (శ్లోకములు) విమానము నకు అమర్చిన స్వర్ణ
రేకుల పై మలచినారు. రాజగోపురము 192 అడుగుల ఎత్తు.
ఈ రాజగోపురము ను తమిళ రాష్ట్రము రాష్ట్ర చిహ్నముగా స్వీకరించిరి.
- రాఘవ రావు
ఈ రాజగోపురము ను తమిళ రాష్ట్రము రాష్ట్ర చిహ్నముగా స్వీకరించిరి.
- రాఘవ రావు