Online Puja Services

బోలెరాం గురుభక్తి.

18.219.36.191
బోలెరాం గురుభక్తి. 
 
సమర్ధరామదాసుగారు ఉత్తరభారతదేశము వెడుతూ రోజూ రామచంద్రప్రభువుకి నైవేద్యము పెట్టమని బోలేరాం అని తన శిష్యుడుకి చెప్పి వెళ్ళారు. 
 
ఆయన నైవేద్యము తీసుకుని వెళ్లి పెడితే సీతారాములు తినలేదు. నా కోసము కాదు మా గురువుగారు చెప్పారు తినకపోతే ఎలా?నువ్వు తినకపోతే నేను గురువుగారికి ఇచ్చిన మాట పోతుంది తింటావా లేదా? అన్నాడు.  అయినా తినలేదు. బోలేరాం నేను గురువుగారికి ఇచ్చిన మాట పోయిందని తలకోట్టుకోవడము మొదలు పెట్టాడు. సీతారాములు వెంటనే పెట్టిన నైవేద్యము తిన్నారు. మీరు తిన్నాక మా గురువుగారు మిగిలిన ప్రసాదము తినేవారు మీరు అంతా తినేశారు నేను ఏమి తినాలి? అని అడిగాడు. 
 
ఇది ఎక్కడి గొడవ అనుకుని సీతమ్మ అట్టు వేసి పెట్టింది. తీరా అట్టు వేసి అరటిఆకులో పెట్టాక మాగురువుగారికి అట్టు అంటే చాలా ఇష్టము ఆయనకు పెట్టకుండా నేను తినను ఆయనకు తీసుకుని వెళ్లి పెడతాను అని పరుగుపెట్టడము మొదలు పెట్టాడు. సీతమ్మ తల్లి మీ గురువు కాశీకి అని బయలుదేరి వెళ్లి చాలా దూరము వెళ్ళాడు ఎక్కడకు అని అట్టు పట్టుకుని వెళతావు? నువ్వు తినరా నాయనా అన్నది. అట్టు మాగురువుగారికి పెట్టకుండా నేను తినను ఆయనకు పెట్టాలి అన్నాడు. 
 
హనుమను పిలిచి భుజము మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమని అన్నది. హనుమ, భుజము మీద బోలేరాంను ఎక్కించుకుని కాశీకి వెడుతున్న సమర్ధరామదాసుగారి దగ్గర దించి పెట్టు నాయనా అని సీతమ్మ తల్లి హనుమతో  అన్నారు. 
 
హనుమ బోలెరాం ని భుజాల మీద ఎక్కించుకొని కాశీకి వెళుతున్న గురువు గారి దగ్గర దింపాడు. బోలెరాం ని చూసి, గురువుగారు తెల్లపోయి ఇక్కడకు ఎలా వచ్చావు? అంటే మీకు అట్టు ఇష్టము కదా! పెడదామని వచ్చాను అన్నాడు. ఎలా వచ్చావు? అంటే ఒక కోతి పట్టుకుని వచ్చింది అని చూపించాడు. కోతి ఎత్తుకుని రావడము ఏమిటి అంటే సీతమ్మ అట్టు వేసి పెడతానని వేసి పెట్టింది.  కోతి ఎత్తుకుని వచ్చింది అన్నాడు బోలెరాం.  కోతి కాదు,  హనుమ మహానుభావుడి భుజముల మీద ఎక్కివచ్చావు అంటే హనుమో! సీతమ్మో! పక్కకు పెట్టి మీకు అట్టు పెట్టాలి నాకు కావలసింది అంతే మీరు అట్టు తినండి గురువుగారూ అని సమర్ధ రామదాసుగారు అట్టు తిన్నాక హనుమ భుజములు ఎక్కి దేవాలయమునకు వెళ్ళిపోయాడు.  తప్ప గురువుగారితో కాశీకి వెళ్ళలేదు. గురువు మాట గురువు అంటే గౌరవము. అది ఈ దేశములో గురుశిష్య సంప్రదాయమునకు ఉన్న గొప్పదనము.

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha