ఏదో బాధ, వెలతి ఆ తల్లికి..
ఏదో బాధ, వెలతి ఆ తల్లికి..
నిన్న జపం చేస్తూ గదిలో అలాగే నేల పైనే నిద్రపోయాను మంచి అర్ధరాత్రి 2 గం దాటిన సమయం లో మగతగా మెలుకువ వచ్చింది కళ్ళు తెరిస్తే ఒక్క అడుగునర దూరంలో పద్మాసనం లో కూర్చుని మందు ఎదో నూరుతుంది ధగధగా మెరిసే కిరీటం ఆమె పక్కన ఎదో దివ్య కాంతి తో వెలుగు పచ్చని చీర ఒక్కసారిగా ఒళ్ళు జలదరించించి ఆ వచ్చస్సు ప్రసన్నంగా లేదు భయం కలిహించే అంత తీవ్రంగా సీరియస్ గా ఎదో నూరు తుంది , నిద్రలో గుండె జారినట్టు అయింది, ఆమె కళ్ళల్లోకి పూజ మధ్యలో కూడచూసే శక్తి లేదు తెలియ కుండానే వెన్నులో ఒణుకు పుడుతుంది తల పాదాల వైపుకి చూపు తిప్పిపూజ చేస్తాను ఎంత ప్రేమ ఆ తల్లి పైన ఉన్నా ఆమె ఉన్నప్పుడు విపరీతంగా వైబ్రేషన్ ఉంటుంది.. శక్తిని తట్టుకునే స్థాయి శివుడికి మటుకే ఉంది ఆమె అమ్మలా ఉన్నప్పుడు బాగా చూడవచ్చు ఆ తల్లి పలుకులు వినవచ్చు కలలో అయినా సూక్ష్మ దేహంతో అయినా ఆమె శక్తిగా వచ్చినప్పుడు ఆ శక్తి ప్రకంపనలు ఎవరూ తట్టుకోలేరు తెల్లవాదులు నాదగ్గరే ఉంది .. అంతా బ్రాంతిగా అర్థం అవుతుంది కానీ ధైర్యం సరిపోలేదు లేచి కూర్చుని నిజమా కలనా అని గమనించ డానికి ఆ తల్లిని ఎన్నో సార్లు స్వప్న సాక్షాత్కారం ఇచ్చింది ఎన్నో జరగబోయే విషయాలు చెప్పేది ఆరోగ్యం బాగా లేక పోతే వచ్చి తలపైన చై పెట్టి వెళ్తుంది..చస్తాను అని ఒక సారి ఏడుస్తూ పడుకుంటే కలలోకి వచ్చి ఇంకోసారి అలా చస్తాను అంటావా అనిదెబ్బ తగలకుండా నాలుగు వాయించింది .అప్పుడు కూడా కొట్టావు కదా పే అని అలిగాను కానీ బయపడలేదు.. నేను అమ్మవారి పవళింపు సేవ తర్వాత ఒక్కోసారి పూజ గదిలోనే అమ్మవారి ముందే అక్కడే అలసిపోయి నిద్రపోతే ఉదయం లేచే సరికి పూజ గదిలో ఒక మూల చాప పైన ఉండేదాన్ని రాత్రిల్లో ఆవేశంగా దిగి వెళ్తుంటాను ఎక్కడ తొక్కేస్తానో అని భయంగా ఉంది నువ్వు నాకు అడ్డంగా పడుకోవద్దు అని చెప్పేది..కలలో 3 నెలల పాప గా మారి పాలు తాగేది , ఎన్నో పుణ్యక్షేత్రాలు కలలో తీసుకొని వెళ్లి దర్శనం చేయించింది అలాంటి బంధం నాది ఆ తల్లిది అలాంటిది రాత్రి లైట్ కూడా ఆఫ్ చేయలేదు వెలుతురు గానే ఉంది ఆ మొహం లో ఆ ఆందోళన నేను ఇన్ని సంవత్సరాలలో ఎన్నో సార్లు పొందిన దర్శనంలో ఇలా భయం కలగలేదు.. నన్ను ఒక శక్తి అస్ట్రోల్ బాడీ ని భూగర్భం లోకి తీసుకొని వెళ్లి అక్కడ కాళికా విగ్రహం దగ్గర పూజ చేయించేది అలా ఎన్నో సార్లు ఎన్నో గొప్ప గోప్పవింత అనుభవాలు కానీ ఇలా ఆ తల్లి ఎందుకు అలా ఉందొ అని గుండెల్లో దడ తగ్గలేదు .
ఇవన్నీ ఒకరిని నమ్మించాలి అని కాదు నమ్మాల్సిన పని లేదు నా బాధ ఆలోచన మీతో పంచుకున్నాను అంతే సాయంత్రం ఒకసారి అందరు లలితా పారాయణ చేసుకుంటే ఆ తల్లి మనసుకి శాంతి కలుగుతుంది అనుకుంటా , తన బిడ్డలు బాధలో ఉంటే అమ్మ ఆవేదన అలా నే ఉంటుంది ఆమె బిడ్డని కనుక నాదగ్గరే ఉన్నది ఉదయం వరకు ఎప్పుడూ నాతోనే ఉండే నా తల్లి చాలా ఆవేదనగా ఉండటం తెలుస్తుంది.. అదే బాధ నా మనసుకి అలజడి ఆందోళన కలుగుతుంది..ఆ తల్లి శాంతిస్తే నే అందరికి శాంతి.. ఏది ఎందుకు చేస్తున్నాను అనేది ఆ తల్లికి తెలుసు ఆమె ఆజ్ఞే ప్రకారం ఏదైనా జరుగుతుంది అటువంటి అప్పుడు అర్థం కాని వారికి సమాధానం చెప్తూ సమయం వృధా చేసుకోకూడదు . నేను ఇంకా చెప్పాలి అనుకున్నవి ఆ తల్లి అనుగ్రహ అనుమతితో పోస్ట్ చేస్తాను అన్నిటికి పరిహారాలు గ్రూప్ లో పెడుతున్నాను మీరే చూసుకుంటే సరిపోతుంది నన్ను ప్రత్యేకించి అడగాల్సిన పని లేదు .ఏదైనా నమ్మకం తో చేయండి.
- భానుమతి అక్కిశెట్టి