పరమాచార్య - ప్రాణిదయ
పరమాచార్య - ప్రాణిదయ
ఒక సారి పరమాచార్య స్వామి వారు పుచమలైకుప్పం అనే ఊరిలొ విడిది చేసి వుండగా, మఠం యొక్క ఏనుగుని ఉంచిన పాకకి నిప్పు అంటుకుంది. ఆ మఠం ఏనుగు ఆ మంటల నుంచి తప్పించుకుని గొలుసులు తెంచుకుని మఠం నుంచి బయటకి వెళ్ళిపొయింది. తరువాతి రోజు ఉదయం మఠంలొ పనిచేసేవారు ఆ ఏనుగు ఉన్న పాకకి నిప్పు అంటుకుంది అని ఏనుగు మఠం నుంచి బయటకి వెళ్ళిపొయింది అని తెలుసుకున్నారు.
తరువాత ఆ ఏనుగు 5 మైళ్ళ దూరంలో ఉంది అని తెలుసుకుని మావటి వెళ్ళి ఆ ఏనుగుని తిరిగి మఠం లోకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నం చేశాడు కాని ఆ ఏనుగు మావటికి లొంగలేదు. తరువాత పరమాచార్య స్వామి వారు ఆ ఏనుగు ఉన్న చొటికి వెళ్ళారు. ఆ ఏనుగు పరమాచార్య స్వామి వారిని చూసి మెల్లగా లేచి పరమాచార్య దగ్గరకి వచ్చి ఆయనకి పరమ భక్తితొ నమస్కారం చేసింది. పరమాచార్య తన చేతితో ఆ ఏనుగుని పరమ ప్రేమతో నిమిరి చుస్తే ఆ మంటల వలన ఆ ఏనుగు శరీరానికి కొన్ని గాయలు అయ్యాయి. పరమాచార్య స్వామి వారు ఆ ఏనుగుకి తగిన చికిత్స చెయ్యమని ఆదేశించారు. ఆ ముఠంలొ భక్తుల వలె ఆ ఏనుగు కూడా పరమాచార్య పట్ల నమ్మకం, అపారమైన భక్తి కలిగి ఉండేది.
పరమాచార్య స్వామి వారు మనుషుల పట్ల ఎంత ప్రేమతో ఉండేవారో జంతువుల పట్ల కుడా అంతే ప్రేమ భావంతో ఉండేవారు. మనుషులు లాగానే జంతువులు కుడా పరమాచార్య వారి గొప్పతనం తెలుసుకున్నయేమో...
అందుకే పరమాచార్య స్వామి వారిని పరమ కారుణ్యమూర్తి అనేవారు.
--- శ్రీ సుదర్శనానంద, గన్ని ( పరమాచార్య వారి గురించి వివరించిన పుస్తకం) నుండి
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం