Online Puja Services

తిలక ప్రసాదాలు

18.118.19.123
తిలకాలు మరియు తిలకప్రసాదాల లో చాలా రకాలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని గురించి ఈరోజు చర్చించుకుందాం...
 
పసుపు
కుంకుమ 
చంద్ర (కుంకుమ పువ్వు రంగుకుంకుమ సింధూరం )
పచ్చ కర్పూరం 
రక్తచందనం లేదా ఎరుపు గంధం
గోపీచందనం 
అంగారక 
తిరుమణం 
చాదు 
అష్టగంధం
 
 పసుపు
సంస్కృతంలో దీనిని హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు . శాస్త్రాలలో పేర్కొన్న ప్రకారం ఈ క్రింద పేర్కొన్న వాటికి మైల ఉండదు అవేమిటంటే పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, తమలపాకు, వక్క, పాలు, పెరుగు, నెయ్యి,  తేనె, కూరగాయలు, తులసి,  గంధం అరగదీసే సానరాయి గంధం చెక్క... ఈ 14 వస్తువులకు మైల ఉండదు.  వీటిని మనం ఎవరి నుంచైనా తీసుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు.
 
వీటిలో పసుపు మొదటి స్థానం ఇవ్వబడింది.అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు వక్క ఇచ్చే సమయంలో మొదలు పసుపును ఇచ్చి తర్వాత కుంకుమఇస్తారు..
 
పసుపు సౌభాగ్యానికి చిహ్నం అందుకే పసుపును ముందుగా ఇస్తారు ఈ కారణం చేతనే సుమంగళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు..
 
దేవి ఆలయాలలో నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలను ముఖ్యమైనవి.గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్ళినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? సహజంగా చాలామంది ఈ పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటలలో ఉపయోగిస్తారు లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు.. అయితే ఇకపైన ఎప్పుడు అలా చేయవద్దు .  వంటలకు కానీ స్నానానికి కానీ ఈ పసుపును ఉపయోగించకూడదు..
 
ప్రసాదంగా తీసుకువచ్చిన పసుపును ఉపయోగించాల్సిన విధాన క్రమం
 
దేవుని ప్రసాదమైన పసుపును ప్రతిదినం పూజ స్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి ,ఇంట్లో ఉన్న వారికి అన్ని విధాలా ధన కనక వస్తు వాహనాలు వృద్ధి చెందుతాయి..
 
 ప్రసాదం గా ఇచ్చిన పసుపుతో కాకుండా మామూలుగా దొరికే పచ్చి పసుపు తో చేసే స్నానాన్ని మంగళ స్నానం అంటారు ఈ విధంగా చేసే స్నానం దేహ కాంతి పెంపొందిస్తుంది..
 
పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకున్న వివాహ దోషాలు తొలగిపోయి త్వరలో వివాహం నిశ్చయమవుతుంది..
 
 దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలుతొలగిపోతాయి..
 
దుకాణాలలో చాలా రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువుల పై కొద్దిగా ప్రసాద పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారం అవుతుంది..
 
మామూలు పచ్చి పసుపు తో ఇంటిని కడగడం ద్వారా ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు అప్పుల బాధ తొలగిపోతుంది..
 
ఇంట్లో కామెర్ల వ్యాధి ఉన్నవారు పసుపు దానం చేయడం వలన ఆ ఇంటి నుంచి కామెర్ల వ్యాధి దూరమవుతుంది..
 
గృహ దేవతలను పసుపు నీటితో కడగడం ద్వారా విగ్రహాలకు దైవ కల పెరుగుతుంది..
 
వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టె లో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది..
 
కుంకుమ 
కుంకుమ సుమంగళీ లకు దేవతలకు దేవికి చాలా ఇష్టం కుంకుమకు దృష్టి పరిహారం చేసే శక్తి ఉంది
 
⚜️కుంకుమ తో చేసే అర్చనతో అన్ని రకాల దేవతలు, దేవిలు తృప్తి చెందుతారు..
⚜️సుమంగళులు ఇచ్చే కుంకుమతో ఇంట్లో ఉండే వివిధ దోషాలు తొలగిపోతాయి.. దేవి అనుగ్రహం కూడా ఉంటుంది..
⚜️ కుంకుమ దానంతో ఇంట్లో ఉండే సమస్త దోషాలు నివారించబడతాయి..
⚜️కుంకుమను గుమ్మడికాయలో ఉంచి దిష్టి తీసి కొడితే అన్నిరకాల దృష్టి దోషాలు దూరమవుతాయి..
⚜️ఎవరైతే కుంకుమను ప్రతి రోజు నుదుటన ధరిస్తారో వారికి దేవతలందరూ ఆశీర్వాదం ఉంటుంది..
⚜️కుంకుమ నీటితో దిష్టితీసి వీధిలో వస్తే అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి..
⚜️ఉప్పు వేయని అన్నంలో కుంకుమను కలిపి దిష్టి తీసి మూడు రోడ్లు కలిసే స్థలంలో ఉంచితే త్వరగా అన్నం దిష్టి దోషాలు తొలగిపోతాయి...
 
 చంద్ర
చంద్ర శ్రీ మహాలక్ష్మి దేవికి, ఆంజనేయస్వామికి చాలా ఇష్టం.... చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉంటుంది... కుంకుమపువ్వు రంగు కుంకుమ అని కూడా అంటారు...
 
⚜️చంద్రతో శ్రీ మహాలక్ష్మి గర్జన చేస్తూ వస్తే ఇంట్లో డబ్బులు ఎప్పుడు ఎటువంటి సమస్య రాదు.
⚜️ చంద్రతో దేవుడిని పూజిస్తే దేవునికి కళ మరియు తేజస్సు వస్తుంది..
⚜️చంద్రతో మంగళ గౌరీ పూజ చేస్తే మన మనసుకు ఇష్టమైన అబ్బాయి లేదా అమ్మాయి పరిచయమై త్వరలో వివాహం అవుతుంది..
⚜️చంద్రతో శ్రీ రాధాకృష్ణ దేవుని అష్టోత్తరం చేస్తే ఇంట్లో మంగళ కార్యాలు ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతాయి..
⚜️ చంద్ర కలిపిన అన్నంని శాల్యాన్నం అని పిలుస్తారు...ఈ అన్నాన్ని పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా పూజిస్తే అన్ని వ్యాధులు తొలగిపోతాయి..
 
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore