మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి... ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి, ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...
అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ... ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,
వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు, ఎవరు వెంట కూడా వెళ్ళలేరు, అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...
దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం
Quote of the day
In a gentle way, you can shake the world.…
__________Mahatma Gandhi