Online Puja Services

21 జూన్ 2020 సూర్య గ్రహణం

3.135.192.51
శ్రీశార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య ఆదివారం చూడామణి నామక సూర్యగ్రహణం తేదీ : 21-06-2020  ఉదయం స్పర్శ కాలం 10గం. 24 నిమి.నుండి కాలం 1గం. 53నిమి. ల వరకూ కాలం 12గం. 07నిమి.  గ్రహణ ఆద్యంతం పుణ్య కాలం 3 గంటల 29 నిమిషాలు   
మృగశిర, ఆరుద్ర నక్షత్ర ములవారు చూడరాదు,  మిథున రాశి లో రాహుగ్రస్త అంగుళ్యాకారంలో సూర్య గ్రహణం సంభవిస్తోంది .

మిధున, వృశ్చిక, కర్కాటక రాశి వారికీ 
అశుభ
 ఫలం. 
మకర సింహ రాశివారికి శుభఫలం. 
మిగిలిన రాశులవారికి మధ్యమ ఫలము.

ఈ గ్రహణం భారతదేశముతో పాటు ఆసియా , ఉత్తర ఆస్ట్రేలియా , పాకిస్తాన్ , శ్రీలంక , ఆఫ్రికా మొదలగు ప్రాంతములయందు కూడా కనిపించును . చాలా ప్రాంతములలో పాక్షికముగా కనిపించును , డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపించును.


గ్రహణ సమయనియమాలు

గ్రహణం రోజు అనగా 21-06-2020 ఆదివారం నాడు  ఉదయం 6 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం  ఉదయం 8 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును. గ్రహణం సమయంలో  మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. పరమ పవిత్రమైన శక్తివంతమైన స్వర్ణ భైరవ మంత్రం. ఓమ్ నమోభగవతేస్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా
లేదా సూర్య గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

గ్రహణం  రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం గ్రహణం విడుపు తర్వాత అనగా మధ్యాహ్నం 2  గంటలకు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం ) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను శుద్ధి చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం గూఢాన్నాన్నినివేదన చేయాలి, ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన గ్రహణం ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో మల,మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి.

ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మిధున, కర్కాటక,వృచ్చిక మీన రాశుల వారు తప్పక మీ గృహంలో పార్థివ శివ లింగ అభిషేశం శుభ ప్రదమైనది ద్వాదశ రాశుల వారు నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని  కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.

ఒక ప్రక్క సూర్య గ్రహణం  మరియు గ్రహఫలములు చూడగా  ఉపద్రవాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజలు అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం వాటికి తగిన శాంతుల చేయడం కూడా జరిగింది. దాని ప్రభావం వల్ల ఈ సమయంలో కరోనా అనీ రాక్షసి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది.

కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సమయంలో  క్షేత్ర పాలక కాలభైరవ స్వామి కి, సూర్యభగవానుడు కి తగిన విధంగా ప్రార్థన చేసి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని కాపాడమని వేడుకుందాం.

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha