మంగళసూత్రంలో ముత్యం పగడం ఎందుకు కలుపుతారు తెలుసుకోండి....
మంగళసూత్రంలో ముత్యం,పగడం ధరింపజేసే సాంప్రదాయం మనకు పూర్వమునుండి వస్తున్నది.దానికి తగు కారణములను విశ్లేసించుదాము, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీకగా , దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు మరియు అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంధులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భదారణ, ప్రసవములకు కారకుడు.
ఇక కుజగ్రహ కారకత్వముగా : అతికోపం,కలహాలు,మూర్ఖత్వం,సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని మరియు విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, ధీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా చూసినప్పుడు ఉదరము,రక్తస్రావము, గర్భస్రావము,ఋతుదోషములు మొ!! ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27, ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం, అర్ధం ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఖచ్చితంగా ఋతుదర్శనమవాలి. మన సాంప్రదాయంలో స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది మరొకటి లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం వంటిది మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది, అదేమితో మనము తెలుసుకొందాం. ముందుగా ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది అప్పట్లో చాలా అరుదైన విషయం, కాని నేటితరం స్త్రీలలో కానుపు అనగానే ఆపరేషన్ లేనిదే జరగటం సర్వసాధారణమైపోయినది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చ కిరణాలలోనుండే ఎరుపు(కుజుడు)తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ రెండు గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటం ఎటువంటి సందేహంమనకు కనపడదు.
కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం,పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభపలితాలు సమకూర్చుతుంటాయి. మరొక ముఖ్యమైన విషయమేమిటంటే శుక్రుడు వివాహకారకుడు మాత్రమే, కాని సంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడేనన్న మాట మనం మరువకూడదు, అందుకే తొలుతగా కుజదోషం ఉన్నదా లేదా అని చూస్తారు.ఇక ఆ స్త్రీ కి జాతక పరం గా కూడా ఆ గ్రహాలు శుభ ఫలములను ప్రసాదించేవి అయ్యితే మరింత శుభములు ఆ స్త్రీ పొందే అవకాశమున్నది...!
- విజయలక్ష్మి కూరపాటి