Online Puja Services

ఆత్మ శరీరం : విసుద్ది చక్రం 5th Body : 5th Chakra

3.137.176.213

ఇది చాలా విలువైన తెలుసుకోవాల్సిన సమాచారం. ఎందుకంటే మన పురాణాలూ ఇక్కడ వరకే వ్రాసి పెట్టాయి. ఈ లెవెల్లో లక్షల మంది మోక్షం ఇదే అని అనుకుని ఆగిపోయారు. ఇది త్రిశంకుస్వర్గం లాంటిది. ఈ information మీకు lifelong use అవుతుంది.

ఈ చక్రానికి కేంద్రం కంట్టస్టానం. మొదటి నాలుగు శరీరాలు ద్వంద్వ ప్రవ్రుత్తి కలవి. ఈ అయిదవ శరీరం ద్వంద్వాతీతం. నాల్గవ శరీరం వరకే స్త్రీ, పురుష బేధం కనిపిస్తుంది. ఆత్మ శరీరానికి స్త్రీ, పురుష బేధం ఉండదు. మనుషులలో తేడాలు స్త్రీ, పురుష బేదాల వల్ల ఏర్పడినవే.

ఇక్కడ నుండి యోగ సాధనలో శ్రమ ఉండదు. బేధాభావం లేనప్పుడు అభివృద్దికి ఆటంకాలు ఏర్పడే ప్రసక్తి లేదు. ఎలాంటి అవరోధాలు ఉండవు. అసలు నాల్గవ శరీరం ఏర్పడడంతోటే సాధకుని స్థితి మారిపోతుంది. అన్నిటికీ అతీతంగా ఉందా గలుగుతాడు. అలా ప్రవర్తించ గలడు. తన గమ్యం ఈ లోకం కాదన్నట్లు, తన పయనం ఆత్మలోకి అన్నట్లు ఉంటాడు.

నాల్గవ శరీరం సాధించి, అందులో పూర్ణత్వం పొందిన సాధకుడు సులభంగా అయిదవధైన ఆత్మ శరీరం పొందగలడు. అయిదవ శరీరం అంతా చైతన్యమే. అంతా జాగ్రితి. రాత్రి వేళల్లో సైతం యోగి చైతన్యంలో మేల్కొనే ఉంటాడు. నిద్ర ఉండదు. అలసట ఉండదు. విశ్రాంతి అవసరం కనిపించదు. శరీరం, మనస్సు ఏదీ అలసిపోదు. 24 గంటలూ పనిచేసినా అలసట ఉందదు. మనస్సు సదా మేల్కునే ఉంటుంది. కనుక ఎలాంటి ఆలోచనలు కలవరం పెట్టావు. కలల్ని కలిగించవు, శరీరం విశ్రాంతి తీసుకుంటున్నా మనస్సు మేలుకొని ఉంటుంది. అంటే లోపలి సూక్ష్మ శరీరాలు సదా మేల్కొనే వుంటాయి. భౌతిక శరీరం వాటి కార్యక్రమాలకు ప్రతిబంధం కాదు. శరీరం నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది కానీ, చీమ చిటుక్కుమన్నా మెలుకువ వస్తుంది. అది నిత్య జాగ్రదవస్థ. అంటే ఏమిటి? మనస్సు అలుపు, సొలుపు, విశ్రాంతి లేకుండా సదా అప్రమత్తంగా ఉంటుంది. నిద్రలో సైతం చైతన్యం తరగదు.

ఆత్మ శరీరానికి ' నిద్ర ' ప్రధాన ద్వారం. గత శరీరాలలో నిద్రతో జోగి , తూగే వ్యక్తి అయిదవ శరీరం ఏర్పడగానే శాస్వతంగా నిద్రకు దూరమవుతాడు. అంటే చైతన్య స్పూర్తితో చైతన్య మూర్తి అవుతాడు.

నాల్గవ శరీరం ఏర్పడిన ప్రతి సాధకుడు బుద్ధుడే. ఆత్మ చైతన్యం పొందడమే భోదిసత్వ సిద్ధి. నాల్గవ శరీరం వరకు మన పెత్తనం కనిపించదు. ఏదో జరుగుతున్నట్లు, ఆ జరిగే సంఘటనలు దైవికమని, మానుష ప్రయత్నం వల్ల జరగడంలేదని, మనం నిమిత్త మాత్రులం అని అనిపిస్తుంది.

అయిదవ శరీరం ఏర్పడగానే కర్త్రత్వం మనది అవుతుంది. అప్పుడు గడిచిన నాలుగు శరీరాల పైన, దాటి వచ్చిన నాలుగు చక్రాలపైన ఆధిపత్యం మనకే వస్తుంది. అంతవరకు నిమిత్త మాత్రులంగా వున్నా ఇప్పుడు స్వఇచ్చతో, స్వసంకల్పం తో ఆ పనులన్నీ నిర్వహించగల ప్రజ్ఞ ఏర్పడుతుంది. " ఇది నేను చేస్తాను, చేస్తున్నాను " అని చెప్పకుండానే అన్నీ చేస్తాం. అపజయం ఉందదు. ఆత్మ శరీరికి అహంకారం ఉండదు - అపజయం ఉండదు.

మామూలు మనిషి నిద్రకు, చైతన్య వంతుడైన వ్యక్తి నిద్రకు చాలా తేడా ఉంటుంది. మామూలు మనిషికి నిద్రలో తన గురించి ఏమీ తెలియదు. తన శరీరాన్ని మనస్సును మరిచిపోతాడు. చైతన్యం గల వ్యక్తి సదా జాగృతిలో ఉంటాడు గనుక, శరీర స్పృహ, మానసిక అనుభూతి ఉంటుంది.

" నేనెవరు? " అనే ప్రశ్నకు అయిదవ శరీరంలో గాని సమాధానం దొరకదు. ఆత్మ మేల్కొన్నపుడు మాత్రమే 'నేను' అనేది ఏమిటో ఎరకవుతుంది. ' నేను ' అనేది ఆత్మ. అది ఆత్మ గతం. ఆత్మ శరీరంలో పూర్తిగా లయించి, నసించిపోతుంది. వ్యక్తిత్వం పూర్తిగా పోతుంది. ఈ శరీరం మనస్సు నావి కావు, నేను 'నేను' కాదు ఇతరం అన్న స్పృహ, జ్ఞానం కలుగుతుంది. అక్కడ ఏ ద్వంద్వాలు , బంధాలు, బాధలు, వికారాలు ఉండవు. ఆత్మకు, ఆత్మ శరీరానికి అది ఆనంద నిలయం. అక్కడ శరీరాన్ని త్యజించాలని అనిపిస్తుంది. శరీరంతో అవసరం కనిపించదు. చాలా మంది యోగులు, మహర్షులు ఆ స్థితి లోనే, ఆత్మ శరీరం పొందిన తర్వాత భౌతిక శరీరం అనవసరం అనిపించి, శరీరం విడిచిపెడతారు. ఐచ్చికంగా శరీర త్యాగం చేస్తారు. కొందరు సజీవ సమమది అయి, ఆత్మ శరీర్లుగా ఉంటారు. అది యోగికి ఆఖరి మజిలి కాకపోయినా, భౌతిక శరీరం అనవసరమని గ్రహిస్తారు. దానిని త్యజిస్తారు.

అది ఆనందస్థితి అనుకుందాం. ఆనందాన్ని ఎంత అనుభవించినా తనివి తీరదు. తృప్తి కలగదు. సచ్చిదానంద స్థితి లో తన్మయుడై శరీరాన్ని, శరీర సుఖాలను అలక్ష్యం చేయడం, విస్మరించడం జరుగుతుంది. తర్వాత తాను సాధించ వలసిందేమి లేదనిపిస్తుంది. కనుక అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. ఏ మాత్రం తృప్తి పడినా తర్వాత ప్రయాణం సాగదు. ఆనందం పతాక స్థితికి చేరుతుంది. సచ్చిదానందంతో ఆగిపోకుండా, ఆత్మను వేరు చేస్తే, ఆత్మ స్పృహతో మున్ముందుకు సాగడం సాధ్యం.

నైరాస్యంతో ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు భగవంతుని వైపు దృష్టి మళ్ళిస్తారు. లేదా తమను కష్టాలనుండి కాపాడగల మహాత్ముడు ఎవరా అని వెదుకుతుంటారు. అన్నీ బాగున్నప్పుడు ఎవరూ భగవంతుని స్మరించరు. మహాత్ములని వేదకరు. అలాగే సచ్చిదానంద స్థితిని చేరిన సాధకుడు ఆ ఆనంద పారవశ్యంలో తన తుడుపరి గమ్యాన్ని మరిచిపోతాడు. ఇక్కడ సచ్చిదానందం కూడా ఒక అవరోధమే అవుతుంది. ఆత్మ జ్ఞానం కలగగానే సాధన కొంచెం మందగిస్తుంది. చాలా మంది ఆ తర్వాతిదైన బ్రహ్మ జ్ఞానం గురించి మరిచిపోతారు.

బ్రహ్మ్మాన్ని అనుభూతించడం అంటే సృష్టి కేంద్రానికి చేరడమే. ఆనందంతో దాన్ని మరిచిపోతే ఎలా? సచ్చిదానందం కూడా ఒక విధమైన అనుభవంగా గుర్తించాలి. అప్పుడు విస్మృతి ఉండదు. ఆత్మ స్పృహ పోదు. అక్కడ అలా జరగడానికి ఒక కారణం ఉంది. అక్కడ మనస్సు ప్రమేయం ఉండదు. అప్పటికే మనస్సును దాటి చాలా దూరం వచ్చేస్తాం. మనస్సు భూమిక కానప్పుడు ఏదీ అనుభవంగా మిగలదు. అనుభూతి అవుతుంది. అనుభవాన్ని మాటలతో చెప్పగలం గాని, అనుభూతిని వ్యక్తం చేయలేం. అది అవ్యక్తానందానుభూతి. అయిదవ శరీర అనుభవాలు అవ్యక్తాలు. అక్కడ ఆత్మ దర్శనం అవుతుంది. ఆత్మ జ్ఞానం కలుగుతుంది. అవ్యక్తానందం తనదవుతుంది. ఆ దివ్యస్పూర్తితో చెప్పేది ప్రామాణికం అవుతుంది. కానీ సత్యసమ్మతం కాదు. సత్యం ఇంకొంచెం పైమెట్టు పైనగాని అందదు. సత్యం కోరేవారు, సత్య దర్శనం కావాలనుకొనేవారు ఇంకా పైకి పయనించాలి.

మన తపస్సు, అన్వేషణ సత్యం కోసం అయితే అయిదవ శరీరంతో ఆగిపోము. కనుక యోగారంభంలోనే మన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి.ఒక ఆనంద స్థితికి చేరుకోవదమో, స్వర్గాన్ని పొందడమో, సచ్చిదానంధమో లక్ష్యం అనుకుని యోగం ప్రారంబిస్తే, అక్కడి దాకా వెళ్లి ఆగిపోతాం.
సత్యాన్ని గమ్యం చేసుకుని ప్రస్థానం సాగిస్తే కడవరకు, సృష్టి మూలం వరకు వెళ్ళవచ్చు.ఎందుకంటే అయిదవ చక్రం వరకు ఆరోహణ సజావుగా సాగినట్లే అనిపిస్తుంది. కానీ అక్కడ సడన్గా ఆగిపోవడం, ముందు దారి కనిపించకపోవడం జరుగుతుంది.

మన లక్ష్యం సత్యం అయితే అక్కడ ఆగిపోము. అంటే ఆత్మ శరీరంతో తృప్తిపడం. అత్యద్బుతం, అపూర్వం అయిన అనుభవం సాధకుని చాలా ఎత్తులకు చేర్చడం వలన, ఇంకా ఆపైన ఏమీ లేదని అనిపిస్తుంది. అదే అవరోధం.ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం అనుభవించిన కస్టాలు, బాధలు, బందిఖానాలు, బంధాలు అన్నీ వదిలించుకుని ఆత్మ సర్వస్వతంత్ర మవుతుంది. ఈ ప్రపంచపు కల్లోలాల నుండి ఒక్కసారిగా ఆనంద సీమల్లోకి వచ్చి పడగానే మనల్ని మనం మరిచిపోతాం. గమ్యాన్ని సైతం మరిచిపోతాం. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాం. అక్కడే శాస్వతంగా ఉండిపోవాలనిపిస్తుంది. అంటే ఆత్మ సైతం ఒక ప్రలోభానికి లోనవుతుంది. అక్కడ లయించిపోతున్నామని తెలుస్తుంది. అయినా ప్రతిఘటించలేము. ఆ మహా శక్తి ముందు మన ప్రయత్నం, శక్తి అక్కరకు రాదు. అందుకే అయిదవ శరీరం లయ. అది యోగంలో లయించడం, చైతన్యంలో లయించడము అదే.

' అహం ' నశించినా ' అత్మస్ప్రుహ ' మిగిలే ఉంటుంది. ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది లీలగా. అలా అనిపించడమే ' అస్మితం '. ఇక్కడ గుర్తించే పని మనది కాదు 'ఆత్మ'ది. మన ఆత్మ వంటి ఆత్మలు వందలు, వేలు, లక్షలు తిరుగుతుంటాయి.

'మయాహాత్మాసర్వభూతాత్మా ' అన్నట్లు ఇది భూతరహితమైన ఆత్మ సంచారం. ఆత్మ తత్త్వం అవగాహనకు అందదు. అది అనంతం. అక్కడ కనుక కించిత్ అస్తిత్వ స్పృహ వుంటే ఆత్మ తత్వంతో ఆనంద సాగరాన్ని దాటి ఆవలి తీరానికి చేరుకోవచ్చు. ఎల్లకాలం సచ్చిదానంద స్థితిలో మనుగడ సాధించాలన్నా దుర్భరమే.

అయిదవ శరీరాన్ని, భూమికను దాటి ఆరవ శరీరం పొందడం చాలా చాలా కష్టం. ఎవరో మహర్షులకు, మహాయోగులకు మాత్రమే సాద్యం అవుతుంది. అనేక జన్మల యోగ సాధన, తపస్సు అందుకు అవసరం.

ప్రతి జన్మలో తపస్సు చేస్తున్నా, చాలా చాలా సత్కార్యాలు చేసినా అయిదవ శరీరానికి వచ్చే సరికి, లక్ష్యాన్ని విస్మరించడం, సచ్చిదానందంలో తలమునకలై పోవడం జరుగుతుంది. అందుకే మళ్లీ జన్మకు వెళ్ళడం, కారణజన్ము లనిపించు కోవడం జరుగుతుంది. కారణజన్ములైనవారంతా సాక్షాత్తు భగవదంశ సంభవులే, పరామాత్మ స్వరుపులే.

మొదటి నాలుగు భూమికలు సులభం యోగికి. అయిదవ దాన్ని దాటడమే దుస్తరం. మొదటి నాలుగింటిలో మనవ సహజమైన ప్రతిభలు, ద్వేషాలు, అసూయలు, వాంచలు, అహంకారం వదులుకోగలరు. అయిదవ మండలంలో ఆత్మను సైతం వదలవలసి వస్తుంది. బాహ్య ప్రపంచాన్ని త్యజించినంత సులభం కాదు ఆత్మను వదలడం.


- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore