గబ్బిలం అశుభం, అనారోగ్యానికి కారణం
గబ్బిలం ఇంట్లోకి వస్తే ఇల్లు మూసి క్లీన్ చేయాలి..
అని సనాతన ధర్మం చెప్తే, భారతీయులను వారొక పల్లెటూరు గబ్బిలాయిలు అని తీసి పారేస్తారు బాగా చదువుకున్నటువంటి విదేశీ మూర్ఖ శిఖామణులు..
ఈ వేళ ప్రపంచంలో #కరోనా వైరస్ రావటం వలన గబ్బిలం అనేది అనేక వైరస్ల పుట్ట అని నిరూపితమైంది..
అటువంటి గబ్బిలము ఇంటిలోకి వచ్చి తిరుగుతుంటే మనము భయపడిపోతాం. కారణం ఏమిటి అంటే అది సకల అనారోగ్యాలకు కారణభూతమైనది. అటువంటి గబ్బిలము ఇంటిలో మల మూత్రాదులు విసర్జించిన అందులోని వైరస్లు మనుషుల మీద దాడిచేస్తాయి కాబట్టి అనారోగ్యం రావటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి.. దానికి మనము సంప్రోక్షణ నిర్వహించి ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చెప్పడం చేస్తాము. ఇది ఒక పనికిమాలిన వ్యవహారం అన్నారు ఇదివరలో... క్షవరం అయిన తర్వాత గాని వివరం రాదని, కరోన వచ్చిన తర్వాత దీనికి మూల కారణం గబ్బిలం అని తెలిసి అల్లాడిపోతున్నారు..
చెపితే వినరు ఏదైనా వస్తే అప్పుడు చేస్తారు..
అవును ఈ విషయం సనాతన హిందూ ధర్మంలో రుషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు.. అంటూ భారతీయ గ్రంధాలను వెతకటం ప్రారంభిస్తారు..
ఎంతోమంది పోయిన తర్వాత కానీ గబ్బిలం ఇంట్లోకి రాకూడదు అనేది తెలుసుకుంటున్నారు..
మహర్షులారా మీరు దర్శించిన సూత్రాలను మాకు అందించి మార్గదర్శకం చేస్తే మేము కొత్త కొత్త చదువులు చదివి మహర్షులను విమర్శించే స్థాయికి వచ్చాము. పావురాయి గద్ద ఇటువంటివి ఇంట్లోకి వస్తే సంప్రోక్షణ చెప్పిన దానికి కూడా విలువైన సమాచారం ఉంటుంది. అనేక రోగ కారక క్రిమి కీటకాలను అవి విసర్జించి మనుషులను అనారోగ్యం పాలు చేస్తాయి కాబట్టి వాటిని ఇంటిలోకి రానీయకుండా ఉంచడం శ్రేష్ఠం అని చెప్పిన మీ వాక్యం అనుసరణీయం. మిగతా పక్షుల వలన కూడా ఏమి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలియదు కానీ ఇప్పటికీ గబ్బిలాయి బయటపడింది..
మన ఋషులు చూపించిన సనాతన ధర్మాన్ని, సనాతన మార్గాన్ని మనం విస్మరించకూడదు.