Online Puja Services

గర్భిణీ స్త్రీ కొబ్బరికాయ కొట్టకూడదు తెలుసా?

18.222.164.176
స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పే ముఖ్యమైన విషయాలు !
 
• సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఎప్పుడూ వుండకూడదు
• రెండు చేతులతో తల గీరుకోరాదు
• అయినదానికీ కానిదానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోరాదు. ఇది దారిద్ర్యమును తెచ్చిపెట్టును
• ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరియొక ఆకులో వడ్డించ కూడదు
• ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించ వలెను
• గర్భిణి స్త్రీలు టెంకాయ పగులకొట్ట రాదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా వుండ కూడదు
• గర్భిణి నిమ్మకాయను కోసి దీపము వెలిగించ కూడదు
• గర్భిణి స్త్రీలు గుమ్మడి కాయ కొట్టకూడదు
• సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయడం వలన లక్ష్మి కటాక్షము కలుగును. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా ఇంటి యజమానురాలు చేయడం వల్ల లక్ష్మి లోగిలిలోకి రావడానికి దోహదం చేస్తుంది.
• చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించకూడదు
• ఏ వస్తువు అయిన ఇంట్లో లేకపోతే లేదు అనకుండా తీసుకురావాలి లేక నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్వినిదేవతలు మరియు తథాస్తు దేవతలు కూడా పలుకుదురు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore