లక్ష్మి గవ్వల ఉపయోగం ఏమిటి?
లక్ష్మీ కారక గవ్వలు.......!!
గవ్వల్లో పసుపు రంగులో మెరిసే గవ్వల్ని లక్ష్మీ గవ్వలు అంటారు. లక్ష్మీ గవ్వలు, లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. లక్ష్మీకారక గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి.శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉంది.ఎక్కడ లక్ష్మీ గవ్వలు ఉంటాయో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే, మన పూర్వీకులు గవ్వలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు.అందుకే పూజామందిరంలో లక్ష్మీదేవి విగ్రహంతో పాటు శంఖాన్ని, లక్ష్మీ గవ్వలను కూడా పీఠంపై ఉంచి ప్రార్ధించడం ఆనవాయితీ. అందుచేత లక్ష్మీ గవ్వలను సంపాదించి పూజామందిరంలో పూజించే వారికి సిరిసంపదలను వెల్లివిరుస్తాయి.
ఉపయోగాలు.....
1)పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
2)కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
3)గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి
అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి.అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.
4)గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
5)గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
6)వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
7) వివాహ సమయములలో వధూవరులు
ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది.
8) గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే..!!
(సేకరణ)