Online Puja Services

నేటికి థాయిలాండ్లో రామరాజ్యమే ఉంది

3.137.169.14

థాయిలాండ్ లో రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అనే మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.

వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు , ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.

పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే #భూమిబల్అతుల్యతేజ్.

థాయిలాండ్ యొక్క అయోథ్య

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - " క్రుంగదేవ మహానగర

అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -

1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.
థాయిలాండ్ లో హిందూదేవీదేవతలుఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.

1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు 
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు )

థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు  గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్త మైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది.

ఈ వ్యాసం ఉద్దేశ్యం

మన పిల్లలకు , రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.!!జయశ్రీరామ!!
సౌజన్యము:- "మనహిందూసంస్కృతి" !!

సేకరణ: పద్మజ గోరంట్ల 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore