తల్లి తరువాత తల్లి గోమాత
చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగా రాం ఉపాద్యాయ గారు ఈ మధ్య పరమపదించారు .వారు ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని అందించిన తర్వాత మాత్రమే తన దినచర్య ప్రారంభించేవారు ...ఆయన మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తానుకూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది ...
ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..
కపాల మోక్షం అయిందని కాటికాపరి బందువులకు చెప్పగానే ఆశ్చర్యంగా గోమాత కూడా మౌనంగా లేచినిలబడి ఒకసారి తలతో చివరిసారిగా అభివాదం చేసి నిష్క్రమించిది ...అందుకేనేమో గోవును తల్లితర్వాత తల్లి అని మన భారత సంస్కృతి కొనియాడింది ...