Online Puja Services

సాధువులను, గోవులను హింసించడం మహాపాపం

18.226.159.13
సాధువులను, గోవులను హింసించడం మహాపాపం...... 
 
ఇందిరా గాంధీ కి సంబంధించిన ఒక సంఘటన ఇందిరా వంశాన్ని ఎలా బలి తీసుకుందో యదార్ధ ఘటన చెబుతుంది.
 
అహంకారం మనిషిని ఎంత పతనావస్థకు తీసుకు వస్తుందో తెలిపే యదార్థ సంఘఠన ఇది. ఇందిరా గాంధీ 3 వ ప్రధానిగా పదవి అలంకరించడానికి ముందు పరిస్థితి. ఆమె ఎట్టి పరిస్థితులలో ప్రధాని అయ్యే అవకాశమే కనిపించలేదు. ఆనాటి పరిస్థితులలో మద్రాస్ వాడైన నిజలింగప్పకు పూర్తి మద్దతు ఉండింది. అప్పుడు ఇందిరా గాంధీ అందరు సాధు సంతుల ఆశీర్వాదం కోసం తిరిగింది. వారిలో కరపాత్రి స్వామి(హరిహరానంద సరస్వతి)ఒకరు.
 
ఆయన అమ్మా మాకు ఒక మాట ఇస్తే మేము నీవు ప్రధాని గా కావడానికి ఆశీర్వాదం ఇస్తాము అన్నారు. మీరు కోరిన ప్రమాణం చేస్తాను నన్ను ప్రధాని పదవి వరించేట్లు ఆశీర్వదించండి అని వేడుకుంది. ఘణ్పాత్రి మహరాజ్ నీవు ప్రధని పదవిని చేపట్టిన వెంటనే గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి అన్నారు. అలాగే మహరాజ్ అని ఇందిరా గాంధీ మాట ఇచ్చింది. కరపాత్రి స్వామి(హరిహరానంద సరస్వతి)మరియు శంకరాచార్య ఇద్దరూ ఆమెను ఆశ్వీర్వదించారు.
 
వారి ఆశీర్వాద బలమో, ఆమె అదృష్టమో ఇందిరా గాంధీ భారతదేశానికి 3వ మురియు మొదటి మహిళా ప్రధాని గా పదవి చేపట్టింది. కరపాత్రి స్వామి(హరిహరానంద సరస్వతి), శ్రీ శంకరాచార్య ఇద్దరూ రెండు సార్లు ఆమెను కలసి ఆమె ఇచ్చిన మాటనిలబెట్టుకోమని అడిగారు. రెండు సార్లు ఆమె వారికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పంపించి వేసింది. గోపాష్టమి నాడు కరపాత్రి స్వామి(హరిహరానంద సరస్వతి), శ్రీ శంకరాచార్యుల ఆద్వర్యంలో డిల్లీకి గోవులు సంతులు బయలు దేరారు. ఇందిరా గాంధీ వారిమీద కాల్పులు జరిపించింది. అనేకమంది సంతులు చాలా గోవులు తూటాల బారిన పడి చనిపోయాయి.
 
కరపాత్రి స్వామి(హరిహరానంద సరస్వతి) కోపంతో అమ్మా మమ్మల్ని బాధించావు సంతులం కనుక క్షమిస్తాము. కానీ మా తల్లి గోమాతలను చంపించావు దీనికి నా శాపం తప్పక నీకు తగిలి తీరుతుంది. నీ వంశం నిర్వంశమౌతుంది అని శపించారు. ఈ విషయం ఆనాటి పత్రికలలో వచ్చింది. ఆర్యవ్రత్, కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు.
 
సాధువుల శాపవాక్కుకు ఎంతటి బలం ఉంటుందో చూడండి. ఇందిరా గాంధీ సాధువుల మీద, గోవులమీద తుపాకులతో కాల్పులు జరిపించిన రోజు గోపాష్టమి. ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ చనిపోయినది గోపాష్టమి నాడు, ఇందిరా గాంధీ హత్య చేయబడింది గోపాష్టమినాడు, రాజీవ్ గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు.సాధువులను, గోవులను హింసించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ., 
 
 
- వాట్సాప్ సేకరణ 

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha