విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి ?
విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి ?
గృహంలో పెట్టి పూజించే వినాయకుడి విగ్రహం లోహం అయితే ఇక్కడ ఫొటోలో చూపించిన విగ్రహం కన్నా ఎత్తు ఉండకూడదు..
జిల్లేడు, మట్టివి అయితే ఇంత కన్నా కాస్త ఎత్తు ఉడచ్చు కానీ ప్రత్యేకించి వినాయకుడి విగ్రహము మటుకు ఇంతఎత్తే పరిమితం..దానికి కారణం తెలుసుకుందాము....
వినాయకుడు ప్రకృతి స్వరూపం పార్వతి దేవికి మరో రూపం, వినాయకుడి విగ్రహానికి ప్రత్యేకంగా ప్రతిష్ట లేకున్నా మాములుగా పెట్టినా కూడా ప్రతిష్ట చేసిన దాంతో సమానం ,ఒక్క వినాయక రూపాన్ని మటుకే ఏ దిక్కున అయినా పెట్టచ్చు అందుకే వీధిపోటుకి వినాయకుడిని పెడతారు...ఆ స్వామి రూపం ఎటువంటి అరిష్టాలు అయినా తొలగించ గలదు అలాగే విజ్ఞాలు కూడా కలిగించ గలదు..
గృహంలో పరిమాణం పెద్దగా ఉన్న వినాయకుడి విగ్రహం ఉంచు కుంటే.. నిత్యా అబిషేకలు నైవేద్యాలు పెట్టాలి, అన్ని ఉపచారాలు లోపం లేకుండా చేయాలి.. గృహస్థులకు అది సాధ్యపడదు.. ఇంట్లో మాంసం వండకునే వారు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మైలు దోషం ఉంటుంది, ఊరికి వెళ్ళినప్పుడు పూజ కుదరదు, నిత్యము అభిషేకం కుదరదు..దేవుడు కి నైవేద్యం లేకుండా ఉంచ కూడదు, ముక్యముగా ఇంట్లో ఎలాంటి చిన్న గొడవలు అరుపులు ఉండకూడదు..పిల్లలమధ్య భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు సహజం అవి కూడా ఉండకూడదు అది మన ఇండల్లో సాధ్యం కాని పని.
పరిమితము మించిన ఎత్తులో విగ్రహం ఉంటే గుడిలో ఉన్నట్టు ఉండాలి..అందుకే మన పూర్వీకులు విగ్రహాల పరిమితి నిర్ణయించారు.. ఒక్కప్పుడు అయితే విగ్రహాలు ఫోటోలు లేకుండా అవసరం అయినప్పుడు పసుపుతో వినాయకుడిని చేసి పూజ చేసి పూజ ఐయ్యాక నీటిలో కలిపి చెట్టుకు పొసే వారు..
పరిమితము మించిన ఎత్తు ఉన్న విగ్రహం ఇంట్లో ఉంచుకుని పైన చెప్పిన నియమాలు పాటించక పోతే ఇంట్లో ధనం నిలవదు,, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు, విద్య ఉద్యోగం వివాహం అన్నిటా ఆటంకం .అర్తం కాక ఎన్ని పరిస్కారాలు ఆలోచించినా సమస్య అర్థము కాదు...
అందుకే గృహంలో విగ్రహం పెద్దలు చెప్పిన పరిమాణం లోనే ఉండాలి..
అయితే కొందరికి వంశపారంపర్యంగా వస్తున్న విగ్రహం అయితే కొన్ని పూజలు నియమాలు పాటిస్తే చాలా మంచిదే ..
విగ్రహాలు చూడటానికి బాగున్నాయి అని పోయిన ప్రతి గుడి దగ్గరగా తీసుకుని విగ్రహాలు తెచ్చిపెట్టకూడదు...నిత్యం శుభ్రంగా పూజ గది ఉంచాలి..వినాయకుడి విగ్రహం తెచ్చుకోవాలి అనుకున్న గృహస్థులకు ఇంత సైజ్ మటుకే క్షేమం. మీ శక్తికి తగ్గట్టు చేసుకోవచ్చు.. ఫోటోలు అయితే పెద్దవి పెట్టండి..వేరే దేవతా విగ్రహాలు పెద్ద సైజ్ అయితే వెనుక భాగం వీపు లేకుండా ఉండాలి పూర్ణరూపం ఉంచుకోకూడదు..భరించ లేరు..
- భానుమతి అక్కిశెట్టి