Online Puja Services

నేపాల్ దర్శనం - కర్రా నాగలక్ష్మి

3.143.235.104

నేపాల్ దర్శనం - కర్రా నాగలక్ష్మి


హిమగిరుల మధ్య నున్న కైలాశ మానస సరోవరం యాత్ర చేసి వచ్చేక బొంది తో కైలాశం వెళ్లడం అంటే యిదేనేమో అని అనిపించక మానదు . అదేమిటో మీరూ తెలుసు కోవాలనుకుంటున్నారా ? అయితే మా యాత్రా నుభవాలు చదవాల్సిందే ఆలస్యమెందుకు చదివెయ్యండి . భవిష్యత్తు లో యీ యాత్ర చెయ్యాలనుకొనే వారు కూడా చదివితే యాత్రను సునాయాసంగా చేసుకోడానికి ఉపయుక్తంగా వింటుందని హామీ యిస్తున్నాను .

ఎన్నాళ్ళుగానో కలలు కంటున్న కైలాశ యాత్ర 2012 వ సం.. లో శివుని ఆజ్ఞ లభించడం తో మా దంపతులం మాకు తెలిసిన వారు యెవరెవరు యాత్ర చేసి వచ్చారో వారిని అడిగి వివరాలు సేకరించి కొంత , నెట్ ద్వారా కొంత సమాచారం సేకరించి మా ట్రావలర్ ఏజంట్ ని యెంచుకున్నాము . వాళ్ళ దగ్గర వున్న వివరాల ప్రసారం మాకు నచ్చిన టూరుని యెంచుకున్నాం . మా స్నేహితులకు , బంధువుల కు యాత్ర వివరాలు చెప్పి రాగలరేమో అడుగుగా వారు రాకపోవడమే కాక మా మనోబలాన్ని కూడా దిగ జార్చేటట్టు మాట్లాడసాగేరు . ఎవరొచ్చినా మానినా మేమిద్దరం వెళుదామనే నిర్ణయించు కున్నాం . యాత్రల విషయం లో తోడు లేరని మనం వెళ్లడం మానేస్తే ఆ యాత్ర అతి కష్టం మీద పూర్తి చెయ్యడం మాకు అనుభవమే . అందుకే మేమిద్దరమే వెళ్ళేందుకు నిర్ణయించు కున్నాం .

అప్పుడు మావారు ఏజంటు తో బేరసారాలు మొదలుపెట్టేరు . ఆంధ్ర ప్రాంతానికి వారి ద్వారా నియమింప బడ్డ ఏజంటు ఫోను నంబరు వగైరాలు వారు అందజేసేరు . ఈ లోగా ఓరోజు పొద్దున్నె మా చిన్నాన్న గారి అమ్మాయి అల్లుడు ఫోను చేసి వారు కూడా వస్తున్నట్లు , వారితోపాటు మామరిదిగారి అన్న కూతురు పాతికేళ్ళ శోభ కూడా వస్తున్నట్లు తెలియజేసేరు . మేము స్వయం గా ఆంధ్ర ప్రాంతపు ఏజంటు ని కలిసి మా సందేహాలు తీర్చుకొని , మా పాసుపోర్టులు అతనికి అందజేసి మాప్రయాణపు తేదీలు ఖరారు చేసుకున్నాము .

సాధారణంగా నెలలో రెండు మార్లు యాత్ర బయలు దేరుతుంది . మొదటిది పున్నమికి మానస సరోవరం దగ్గర వుండడం , రెండవది అమావాస్య కు మానస సరోవరం దగ్గర వుండడం . మొదటి యాత్రకి వారు వసూలు చేసే ఛార్జలు యెక్కువగా వుంటాయి . పున్నమి వెన్నెల వెలుగులో మానస సరోవరం అందాలు చూడాలనే తపన వొకటి , పున్నమి నాడు అర్దరాత్రి మానస సరోవరం లో స్నానం చేసేందుకు దేవలోకం నుంచి దేవతలు జ్యోతుల రూపంలో వచ్చి ఆసమయానికి అక్కడ వుండే మానవులకు దర్శనం యిస్తారుట , ఆ దేవతల సత్యమేమిటో తెలుసుకోవాలనే కుతూహలం వొకటి ఈ రెండు కారణాల వల్ల మేము బుద్దపూర్ణిమకి మానస సరోవరం వద్ద వుండేటట్టు తారీఖు ఖరారు చేసుకున్నాము .

మొత్తం మాటూరులో మేము చెల్లించిన సొమ్ముకు మాకు వారిచ్చే సదుపాయాలను ఒకటికి పదిమార్లు అడిగి తెలుసుకున్నాము అలాగే మా సౌకర్యం కోసం ఒక టూరు గైడు గా అతనిచ్చే సలహాలను కూడా అడిగి తెలుసుకున్నాం .
మేము చెల్లించిన సొమ్ముకు ఖాట్మండులో స్టారు హొటలు సదుపాయం , మిగిలిన ప్రదేశాలలో దొరికే మంచి సదుపాయాలు కలిగిన గదులు యివ్వబడతాయని , మానస సరోవరం దగ్గర , కైలాశపర్వతం దగ్గర , పరిక్రమ సమయంలోను టెంటులుగాని , రేకుల షెడ్లు గాని కేటాయిస్తాము అని , మేము యెంచుకున్న టూరు రోడ్డు మీదుగా వెళ్ళేది కాబట్టి చైనా ఆక్రమిత టిబెట్టు లో నలుగురు లేక యెక్కువ మంది పట్టే జీపులు లేక వేనులలో ప్రయాణించ వలసి వుంటుందని , ప్రతీరోజు మూడు పూటలా భోజనాల యేర్పాట్లు వాళ్ళవేనని , రైన్ కోట్లు , చలికి తట్టుకొనే మందమైన కోటు , మనిషికి ఒక పెద్ద బేగు ఒక చిన్న బేగు చొప్పున యిస్తామని చెప్పి , మేము బుక్ చేసుకోగానే చలికోటు తప్ప మిగతావి మాకు యిచ్చేరు . చలికోటు ఖాట్మండులో యిస్తారు దానిని తిరిగి ఖాట్మండులో వాపసు చెయ్యాలని చెప్పేరు .

వారు మనకు యివ్వనివి , మనం తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవలసినవి యేమిటంటే 1) పేపర్ రోలు , 2) ఫ్లాస్క్ , 3) చలి బట్టలు నాలుగు జతలు , 3) నాలుగు జతలు మేజోళ్ళు , 4) గ్లౌస్ , 5) ధూళి ముక్కులోకి పోకుండా వాడే మాస్క్ , 6) మంచు లోనడవడానికి పనికి వచ్చే షూష్ , 7) తల కప్పు కోడానికి వూలు టోపి , మఫ్లరు , </div>

                    
    

    

    <style>

	.arrow_box_left {

	position: relative;

	background: #FFFFFF;

	border: 4px solid #990000;

	margin-left:35px;

}

.arrow_box_left:after, .arrow_box_left:before {

	right: 100%;

	top: 50%;

	border: solid transparent;

	content:

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore