ఇంద్రుడి భార్య
ఇంద్రుడి భార్య మాల్యాద్రి క్షేత్రానికి వచ్చిందట
సాధారణంగా కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు,
ఏదో ఒక సమయంలో దేవతలు వచ్చి అక్కడి దైవాన్ని దర్శిస్తూ ఉంటారని చెబుతుంటారు. ఈ రోజుకీ వాళ్లు దేవలోకం నుంచి దిగి వచ్చి పూజించి వెళుతూ ఉంటారని అంటారు. ఏదో ఒక సమయంలో...
ఏదో ఒకరోజు అనే కాకుండా, వారంలో ఆరు రోజుల పాటు దేవతలచే పూజలందుకునే క్షేత్రం ఒకటుంది.. అదే 'మాల్యాద్రి'.
ప్రకాశం జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామిగా ఆవిర్భవించడం జరిగిందని స్థలపురాణం చెబుతోంది.
పరమపవిత్రమైనదిగా... అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సంతాన యోగానికి అడ్డుపడే దోషాలు తొలగిపోతాయని అంటారు. సంతానం లేని స్త్రీలు ఈ స్వామిని ఎక్కువగా దర్శించుకుంటూ వుంటారు.
సాక్షాత్తు దేవేంద్రుడి భార్య అయిన శచీదేవి, ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని పూజించి ఆయన అనుగ్రహం కారణంగా సంతానాన్ని పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది. అందువలన సంతాన లేమితో బాధపడుతోన్న వాళ్లు, మహిమగల స్వామిని దర్శించుకుని మనసులోని మాటను చెప్పుకుంటూ వుంటారు. ఆయన అనుగ్రహంతో సంతానాన్ని పొందిన వాళ్లు మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.