ఇందరు దేవుళ్ళు ఎందుకు ?
ఇందరు దేవుళ్ళు ఎందుకు ?
అని ప్రశ్నించడానికి మనమెవ్వరం ?
మనం సృష్టించుకున్న వాళ్ళు కారు దేవతలు
ఒకే దైవ శక్తి విశ్వరక్షణ కోసం విశ్వ నిర్వహణ కోసం పలురకాలుగా వ్యక్తమయింది
వారే దేవతలు ఆ ఏకత్వాన్ని మనం విష్ణువన్నా శివుడన్నా తప్పులేదు
ఇన్ని చెట్లెందుకు ?
ఇన్ని నక్షత్రాలెందుకు ?
ఇన్ని కొండలెందుకు ?
ఇన్ని పువ్వులెందుకు ?
ఇన్ని నదులెందుకు ?
ఇందరు మనుషులెందుకు ?
ఇన్ని గ్రహా లెందుకు ?
ఇన్ని అవయవాలెందుకు ?
ఈ ప్రశ్నలు వేయడానికి మనమెవరం ?
ఇందరిలో ఒకరిమైన మన శక్తి ఎంత. ?
ఇందరు దేవతలెందుకు ?
అని మన మెవరం నిర్దేశించడానికి ......?
విభిన్న ప్రకృతి శక్తుల్ని
నియిమించే సూక్ష్మ దైవీశక్తులే దేవతలు !
ఒక్కొక్క శక్తిని జాగృతం చేసుకొని
ఒక్కొక్క ప్రయోజనం పొందవచ్చు ......!!
ఒకదానిని అభీష్టంగా కొలుచుకున్నా
మిగిలినవి అవే రూపాలుగా
భావించి నమస్కరించవచ్చు
మన ధర్మంలో ఉన్న ..........
విలక్షణత గొప్పతనం అదే
ఏకో దేవః సర్వభూతేషు గూఢః