రమణ మహర్షి లీల
అరుణాచల
ఒక వ్యక్తి చాలా నిష్ఠగా శాస్త్రములలో చెప్పిన రీతిగా సుబ్రమణ్య స్వామి ని ఆరాధించేవాడు. అతను ఒకసారి మహర్షిని దర్శించి అన్నాడు "మహర్షి నేను చిన్నప్పటి నుండి ఎంతో భక్తి శ్రద్ధలతోసుబ్రమణ్య స్వామిని కొలుస్తూ వస్తున్నాను. కానీ నాకు ఈ నాటి వరకు ఆ స్వామి దర్శనము కాలేదు.
భగవాన్ మౌనముగా ఉండి ఆ వ్యక్తినే తీక్షణముగా చూస్తున్నారు. అక్కడ కవి అయిన మురుగనార్ అనే ఆశ్రమవాసి కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడు మౌనముగా ఉండేవారు. ఎవ్వరు ఎన్ని అన్నా ఆయన మారు మాట్లాడేవారు కారు.
ఈ వ్యక్తి మాటలు విని మురుగనార్ తన చేతులు ఎత్తి భగవాన్ ని చూపిస్తూ అతనితో అన్నారు "నువ్వు సుబ్రమణ్య స్వామి దర్శనము కొరకు ఎదురు చూస్తున్న రొజు రానే వచ్చింది. ఇప్పుడు నీ ఎదురుగ కూర్చుని కనిపిస్తున్న ఈ రూపము ఎమిటి అనుకుంటున్నావు" అన్నారు.
భగవాన్ ఆ వ్యక్తి జీవితాంతము చేసిన సాధనకు ఫలితముగానా అన్నట్టు భగవాన్, సుబ్రమణ్య స్వామి రూపముగా మారిపొయారు. ఇది చూసి ఆ వ్యక్తి నోట మాట రాక పలుమార్లు తన కళ్లు రుద్దుకొని చూడసాగాడు.
మొత్తము మీద కళ్లు బారగా తెరచి ఆనంద భాష్పములు
కారుస్తూ "అవును , అవును" అన్నాడు. అదే రొజు సాయంత్రము ఆ వ్యక్తి రమణ ఆశ్రమము ఎదురుగ ఉన్న మురుగనర్ ఇంటికి వెళ్లి చేతులు జోడించి మురుగనార్ పోషించిన ఈ పాత్రకు కృతఙ్ఞతలు తెలియచేసుకున్నాడు.
మురుగనర్ వ్యాసము
Mountain Path, April 2006