Online Puja Services

కళ్యాణం - ఆశీర్వచనం

18.117.8.41


కళ్యాణం - ఆశీర్వచనం 

ఏ కళ్యాణంలో అయినా, వధూవరులను ఆశీర్వదించేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదువుతూ, అక్షతలు శిరస్సులపై వేస్తాము. 

లక్ష్మీనారాయణౌ గౌరీశంకరౌ భారతీవిధీ I
ఛాయాసూర్యౌ రోహిణీందూ రక్షేతాం చ వధూవరౌ ॥ 

లక్ష్మీనారాయణులు,
గౌరీశంకరులు,
భారతీబ్రహ్మలు, 
ఛాయాసూర్యులు,
రోహిణీచంద్రులు 

అనే ఐదు దేవదంపతులూ ఈ వధూవరులను రక్షించుగాక! 

సందేశం

1. లక్ష్మీదేవి నారాయణుని వక్షస్థలమందు (హృదయమందు) ఉంటుంది.

అంటే భార్యని గుండెల్లో పెట్టుకునే భర్త,
భర్త హృదయమెరిగి ప్రవర్తించే భార్య కలసిఉండిన దాంపత్యం. 

2. గౌరీశంకరులు అర్ధనారీశ్వరులు. 

ఆలోచన - మాట - చేత కలిసె ఉంటాయి. 
ప్రకృతి స్వరూపిణియైన శ్రీమాత గంధం, పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలతో ప్రకాశిస్తూంటుంది. 
పురుషుడైన శివుడు భస్మం, చర్మం, పాములతో విలక్షణంగా ఉంటూ, తన భాగమైన భార్యని ప్రకృతిగా చక్కగా చూస్తాడు. 

3. భారతీబ్రహ్మల దాంపత్యంలో 

బ్రహ్మ నాలుకపై సరస్వతీదేవి ఉండి పలుకుతుంది.

4. ఛాయాసూర్యులలో 

సూర్యుడు చిటపటలాడుతుంటే, ఛాయాదేవి ఆయనని వెన్నంటియుండి సేవచేస్తుంది. 

5. రోహిణీచంద్రుల దాంపత్యంలో 

రోహాణీ కార్తెలా భార్య ఉంటే, వెన్నెలతోపాటు చల్లదనాన్నిస్తూ భర్త చంద్రుడు. 

(వీటికి పౌరాణికంగా ఇతర వివరణలున్నాయి) 

ఈ ఐదు దేవదంపతులనూ ఆదర్శంగా తీసుకుని జీవితకాలమంతా దాంపత్య సుఖాన్ని (మధ్యమధ్యలో బదిలీలున్నా, ఈ ఐదు రకాలలోనే దాంపత్య జీవితం) ఆనందంగా పొందండి అనేది సందేశం. 

— రామాయణం శర్మ 
భద్రాచలం

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha