నామజప మహిమ
నామజప మహిమ
భగవంతుని నామం మనలను ఎంతటి చెడు నుంచి అయినా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా, తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలానే, భగవంతుని నామం పలుకుటచే సర్వ పాపలను దగ్ధం చేయగలదు. అందుకే మనం ఏ పనిలో ఉన్నా, ఏ సమయములో అయినా భగవంతుని నామమును మననం చేస్తూ ఉండాలి.
అందరికి మంత్ర జపం చేయాలని కోరిక. ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని ఎలా అయినా చేయవచ్చు. ఈ మంత్రం అందరు చేయవచ్చు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆచారం పాటించే వాళ్ళు, పాటించని వాళ్ళు.
ఆ మంత్రం ఏంటి అంటే,
హరే రామ హరే రామ రామ రామ హరే హరే!
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే !!
ఈ మంత్రం అందరు జపించ తగ్గది. క్రమం తప్పకుండా ఈ మంత్రం జపించడం వల్ల భగవంతుని కృప కలిగి, చిత్తశుద్ధి కలిగి, అన్ని పనులు నెరవేరగలవు. కాని, మనుషులు ఏమి చేస్తున్నారు? తింటున్నారు, పడుకుంటున్నారు, తిరుగుతున్నారు, చనిపోతున్నారు. పశువులు ఈ విధంగా జీవిస్తాయి. పశువులకి మనకి తేడా ఏమైనా ఉందా మరి?
అందుకే భగవంతుని నామాన్ని ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి.