Online Puja Services

ప్రమాదం లో గర్భిణీ లేడి - కధ

3.135.247.17

ఒక రోజు ఒక అడవిలో నిండు గర్భిణిగా డెలివెరీకి సిద్ధంగా ఉన్న ఒక లేడి నొప్పులతో అడుగులు వేస్తూ అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుండగా, ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. అదే తనికి అనుకూలమైన ప్రదేశం అనుకుని అక్కడికి చేరింది. నొప్పులతో బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా అటుఇటూ చూడగా, పిడుగులు పడి కొద్దిపాటి దూరంలో గడ్డి అంటుకుంది.

లేడిని గమనించి ఇంకొక వైపు సింహం వస్తుంది. మరో వైపు
వేటగాడు లేడిని చంపడానికి బాణం వేస్తున్నాడు. ఇంకోవైపు
పారే నది. ఇలా నాలుగు వైపుల మృత్యువు వెంటాడతుంది.
ఇలాంటి సమయంలో లేడి ఏమి చెయ్యాలి, ఎటు వెళ్ళినా
ప్రమాదమే. 

అయితే ఆ సమయంలో ఆ లేడి ఏమి చేసిందో తెలుసా? 

ఆ ప్రమాదాలను వేటిని పట్టించుకోకుండా తన బిడ్డను
కనే పని మీదే దృష్టిపెట్టింది. అప్పుడు ఏమి జరిగిందంటే పిడుగుల కాంతి వేటగాడి కళ్ళకు తగిలి బాణం గురి తప్పి, సింహానికి తగిలి సింహం చనిపోయింది. ఇంతలో వర్షం పడి సమీపంలో ఉన్న మంటలు ఆగిపోయాయి. లేడిపిల్ల తల్లి గర్భం నుంచి బయటికి వచ్చింది. అన్ని ఒక్కసారిగానే జరిగాయి. దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఎన్ని సమస్యలు వచ్చినా మన పని మనం చేస్తూనే ఉండాలి గాని, నిరుత్సాహంతో ఆగిపోకూడదు.

మన చేతిలో మన అందుబాటులో ఉన్నది మన సవ్యంగా,
ధైర్యంగా చేస్తే మిగిలింది దేవుడు చూసుకుంటాడు.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore