ఒక్క రాత్రిలో నిర్మించుకున్న ఇల్లు, బావి
భారతదేశమే గర్వించే మహా కాలజ్ణాని. ..
శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి....
1630 లో ఒకే ఒక్క రాత్రిలో స్వయంగా నిర్మించుకున్న ఇల్లు, తవ్వుకున్న బావి ఇది.
కడప జిల్లా బ్రహ్మం గారి మఠం సమీపంలో ఉంది. ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
పొలేరమ్మ జాతరకు చందా ఇవ్వకపోవడంతో గ్రామ పెద్ద బ్రహ్మం గారి కుటుంబాన్ని వెలి వేసి, గ్రామస్తులెవరూ ఆశ్రయం ఇవ్వొద్దని, నీళ్లు కూడా ముట్టనివ్వొద్దని ఆదేశించాడు. దీంతో బ్రహ్మం గారు ఒక్కడే స్వయంగా, ఒక్కరోజులో బావిని, ఇంటిని నిర్మించుకున్నాడు.
ఎంత కరువు వచ్చినా ఈ బావిలో పుష్కలంగా నీరు ఉండటం బ్రహ్మం గారి మహిమకు నిదర్శనం.
విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం ప్రచార లోపం వల్ల మరుగున పడిపోతున్నది.