Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన -10

3.142.250.86

శ్రీ విద్యా ఉపాసన -10 

మూడు ఉపాయములు:
అనవ, శక్త, మరియు శాంభవ. అవి ఆత్మసాక్షాత్కారమునకు తోడ్పడుతవి. వాటి కలయిక నిజానికి అనుత్తరకు దారి తీస్తుంది. దానిని జగదానందస్థితి అంటారు. దానిలో జగత్తు అంతా దివ్యముగా మారి పరమాత్మతో ఒక్కటిగా రూపు దిద్దు కుంటుంది. ఆస్థితిలో అన్ని సమయములలోనూ, ఎక్కడ చూసినా అనగా అంతటా సర్వములోనూ ఆనందమే ఆనందము. భేదభావము లేకుండా అభిన్న భావము అన్నివైపులా లోపలా బయటా పొడసూపుతుంది. చైతన్యమే తనను తాను జ్ఞాత, జ్ఞేయము, మరియు జ్ఞానము క్రింద అనుభవము చెందుతుంది. అది ధ్యానమునకు కూర్చోనకపోయినాను పరిపూర్ణ అమృత ఆనంద సార్వభౌమత్వతీవ్రత వృద్ధి చెందుతూ ఉంటుంది. నిత్యఅవగాహనా జగదానందస్థితి అటువంటిది. ఇది ఆరు విధములయిన ఆనందములకు అతీతమయిన స్థితి. ఆ ఆరు విధములు:

1.నిజానంద– మనస్సు కేవలము అనుభవముమీదనే ప్రతిష్ఠితమై ఉండటము (ప్రమాత).

2.నిరానంద – మనస్సు అనుభవమునకు రాని/కాని విషయములపై దృష్టి పెట్టటము. 

3. పరానంద – మనస్సు ప్రాణ అపాన వాయువుల కలయిక బిందువు మీద దృష్టి పెట్టటము. 

4. బ్రహ్మానంద – మనస్సు సమానవాయువు మీద దృష్టి పెట్టటము. అది వివిధములయిన అనుభవైకవేద్యములయిన విషయములను ఒక్కటిగా చేస్తుంది.

5. మహానంద – మనస్సు ఉదానవాయువు మీద స్థిరపడటము. అది సర్వ జ్ఞానమును మరియు అనుభవైకవేద్యములయిన విషయములను ఆత్మలో మమైకం చేస్తుంది.

6. చిదానంద– మనస్సు వ్యానవాయువు మీద స్థిర పడటము. 
అయిదువిధములయిన పరాంబ మహత్యము ఈ క్రింద చెప్పటమయినది. అవి: సృష్టి, స్థితి, సంహార, తిరోధానం లేక విళయం, మరియు అనుగ్రహం.
సృష్టి: సృష్టి పని.
స్థితి: వ్యక్తీకరణను రక్షించే విధము.
సంహార: వ్యక్తీకరణను ఉపసంహరించుకునే విధము.
తిరోధానం లేక విళయం: ఆత్మను కప్పి ఉంచుట లేక ఆచ్ఛాదనం చేయుట.
అనుగ్రహం: దయ లేక స్వీయ ప్రకటన. 
ఈ అయిదు వ్యష్టిలోని జీవుడుకూడా సాధించవచ్చు.

1. దేవతల ద్వారా లేదా గ్రహింపు ద్వారా కనపడేదాన్ని ఆభాసన లేక సృష్టి అంటారు.
2. ఆఖరి వరకు అనుభవాన్ని ఆస్వాదించు అనే దేవతను రక్తి లేక స్థితి అంటారు.
3. ఒక వస్తువునుండి తనను తాను విమర్శ సమయములో ఉపసంహరించు కొను తెలివిని సంహార అంటారు. 

4. వివిధములయిన అనుభవముల ఉపసంహరణ అనేది సందేహములతో కూడిన సంస్కారములు లేక గుర్తులకు దారితీయును. అవి ఆఖరికి అంతర్గత సందేహము అనే పురుగును పుట్టిస్తుంది. ఆ పురుగు మాటి మాటికి తొలుస్తూ ఉంటుంది. అది ఆత్మ యొక్క నిజప్రకృతిని మరుగున పరుస్తుంది లేదా కప్పిపెడుతుంది. దీనిని విళయ లేదా బీజావస్థాపన స్థితి అంటారు.

5. సాధకునిలోని సందేహము మరియు అనుభవము రెండూను చైతన్యము అనే నిప్పులో కాలిపోయినప్పుడు, ఆ సాధకుడు అమ్మ దయకు పాత్రుడవుతాడు. అప్పుడు అతని సత్యస్వరూపము బయట పడుతుంది. దీనిని హఠపాకను అనుసరించి అనుగ్రహము లేక విలాపన అంటారు.

హఠపాకను అనుసరించి యోగి అమ్మ దయస్థితిలోకి ప్రవేశిస్తాడు. దీనిని అలంగ్రాస లేక ఆత్మసాక్షాత్కారము అంటారు. ఈ స్థితిలో సంస్కారములు లేదా సంసారబీజము వ్యక్తిచైతన్యమునుండి సమూలముగా నాశనము అవుతాయి. అమ్మదయ నియమరహితమయినది. అది పరాశక్తియొక్క ఉచిత మరియు సార్వభౌమ అభిమతము. (సశేషం)

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore