శ్రీ విద్యా ఉపాసన -9
శ్రీ విద్యా ఉపాసన -9
ఆవిడను జయదుర్గ రూపములో దర్శిస్తే మనము విజయము సాధించవచ్చు. కష్టతరమయిన మరియు ప్రమాదకర మయిన భౌగోళికము అయిన ప్రయాణము తలపెట్టేముందర ఆవిడను క్షేమాంకరి రూపములో దర్శిస్తే ప్రమాదములను అధిగమించవచ్చు.
ఆవిడను మహాభైరవి రూపములో దర్శిస్తే భూత ప్రేత పిశాచములనుండి విముక్తి పొంద వచ్చు.
ఆవిడను తార రూపములో దర్శిస్తే వరదలు, భూకంపములు, మరియు నుండి నుండి విముక్తి పొంద వచ్చు.
నిజానికి ఆ అమ్మ సంసారము అనే నీటిలో మునిగిపోవు జీవుడికి చేయూతనిచ్చును అని అర్థము.
ఆవిడను త్రిపుర రూపములో దర్శిస్తే జనన – మరణ – జనన వృత్తము నుండి విముక్తి పొంద వచ్చు.
శక్తోపాయ అనగా సత్యాన్వేషణ. దీనిలో ప్రతిబింబించుట అనగా మనస్సును లక్ష్యముమీదనే ఆలోచన, మరియు ఏకాగ్రత పరచుట.
సత్యాన్వేషణకి ఆచరణకై జ్ఞానమును సమాయత్త పరచవలయును. కనుక శక్తోపాయమునకు జ్ఞానశక్తి ముఖ్యము. దీనినే జ్ఞానోపాయ అనికూడా అందురు.
సత్యమయిన జ్ఞానోపార్జనకు మార్గము మూలము మరియు ప్రతిబింబం లేదా బింబ - ప్రతిబింబ వాదము. అనగా ఉత్కృష్ట స్థితిలోనున్నదే క్రింద స్థితిలో ఉన్నదానికి మూలము. పశ్యంతి, మధ్యమ, మరియు వైఖరీల వ్యక్తీకరణకు మూలము ఉత్కృష్ట స్థితిలోనున్న ‘పరా’ యే.
ఆగమ సిద్ధాంతం ప్రకారము అంబ లేక అమ్మ రెండు పాదములు శివ మరియు శక్తి. అవి జ్ఞాన మరియు క్రియాశక్తికి ప్రతీకలు. ఈ తత్వమును అర్ధనారీశ్వర లేక అర్ధనారీశ్వరి తత్వము అంటారు.
అంబ యొక్క సువర్ణరంగులోయున్న ఒక కుండ మాదిరియున్న స్థనము ఆనందమునకు ప్రతీక. ఆ ఆనందపు అమృతమువంటి క్షీరము త్రాగుటకు కుమారస్వామి మరియు గణేశుడు పోటీ పడుతూ ఉంటారని అభియుక్తుడు అంటారు.
ఎత్తుగాయున్న చరణమును నిర్వాణచరణము అంటారు. అది శక్తియొక్క మూలమునకు ప్రతీక.
అది బంధమును ఛేదించుటకు వలసిన దివ్యమయిన జ్ఞానమునకు ప్రతీక. యోగదృష్టిలో ప్రాణ మరియు అపాన కలిసి సుషుమ్నా సూక్ష్మనాడిలోకి ఎక్కడ ప్రవేశిస్తాయో అది బిందువునకు ప్రతీక. అది ఒక్క గురువు ద్వారానే సాధ్యము. ఆయన ద్వారా నేర్చుకున్న జ్ఞానభిక్షే శివం అనే ముఖద్వారము (gateway) ను తెరవగలదు.
అదే విశ్వమానవ సౌభ్రాతృత్వ మునకు, మనమంతా భగవంతును బిడ్డలము, మరియు పరమాత్మ ఒక్కడే అనే సత్యాన్వేషణా జ్ఞానమునకు దారితీయగలదు. అది అమ్మ పరాశక్తి సరి అయిన సమయములో సద్గురువు ద్వారా శక్తిపాతము లభ్యము అయి నప్పుడు మాత్రమె సాధ్యమగును. అప్పుడు అహంకారము మొత్తము సమూలముగా నాశనమగును. ఇక తిరిగి చిగురించదు. (సశేషం)