Online Puja Services

అగ్ని అమ్మవారు దీపం

3.145.18.135
అగ్ని అమ్మవారు దీపం
 
సృష్టి మొత్తం ఆమె నుండి ఏర్పడినప్పుడు పంచభూతాలు, పంచతత్వాలు, పంచప్రణవాలు అన్ని ఆ తల్లి రూపమే, అలా అగ్ని రూపంలో అమ్మవారు సాక్షాత్తు శక్తి గా వ్యక్తం అవుతుంది. ఆ తల్లి చిదగ్ని నుండే రూపు దాల్చుతుంది..ఈ అగ్ని ద్వారానే హావిస్సు రూపంలో దేవతలకు శక్తి అందుతుంది.. ఈ నిత్య అగ్నిహోత్రం ఎంతో గొప్ప అనుష్ఠానం..
జీవుడిలో అగ్ని యొక్క స్థానం ఇలా ఉంటుంది ,అగ్ని వాక్కుగా ముఖమునందు, వాయువు ఘ్రాణముగా నాసిక యందు, ఆదిత్యుడు దృష్టిగా నేత్రములందు, దిశలు శ్రవణేంద్రియములుగా చెవుల యందు, జలము వీర్యముగా శిశ్న మందు, మృత్యువు అపానముగా నాభి యందు ప్రవేశించగా; ఈశ్వరుడు శరీరం నిలబడుటకు శిరస్సు ద్వారా పైనుండి బ్రహ్మ రంధ్రములోనికి ప్రవేశించెను. అగ్ని నుండి సమస్త ప్రపంచము ఏర్పడినది. సూర్యుడు కూడా అగ్ని స్వరూపుడే. రాత్రి, పగలు అగ్ని యొక్క సంతానము.
అగ్ని రూపంలో అమ్మవారిని భావించి దీపం లో దర్శనం చేయాలి దీపం జోతిలోకి ఆ తల్లిని ఆవాహన చేసి ఆ దీపంలో ఉపాసించాలి అగ్నిలో ఆమె ప్రత్యక్షంగా దర్శనం ఇస్తుంది ఇది దీప దుర్గా ఉపాసనలో అనుభవం అవుతుంది.. దీపాలు వెలిగించి చేసే ప్రార్ధనకి అందుకే అంత శక్తి ఉంటుంది.. దీపాలతో దీప కాంతి రూపంలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఉపాసన చేస్తారు..ఈ ఉపాసనలో ఆ కాంతి అమ్మవారి ఆకారంలోనే ప్రత్యక్షంగా పూజను స్వీకరిస్తుంది.. ఇది పద్దతిగా గురువును నుండి సాధన నేర్చుకుని చేయాలి.. అలా ఆవాహన చేసిన తల్లి ని దేవి మహత్యం స్ట్రోత్రాలతో, ఉపదేశం పొందిన మంత్రం యొక్క సంపుటికరణ స్త్రోత్రం అర్చనతో పూజించి ఆ స్వరూపం అంతర్ధానం అయే వరకు మనసులో నే మంత్రం జపిస్తూ ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా ఆ శక్తి మనలోకి చేరిపోతుంది.. ఈ సాధన కోరికలతో చేయాకుడదు అమ్మవారి అనుగ్రహము పొందడానికి చేయాలి ఎందుకంటే ఆ స్థాయిలో అమ్మవారిని ప్రత్యక్షంగా ఆ కాంతిలో అనుభూతి చందుతూ ఒకరకమైన భయం తో కూడిన భక్తి ఏర్పడుతుంది వెన్నులో వణుకు పుడుతుంది నేరుగా ఆమెను చూసే ధైర్యం సరిపోక చూపు ఆమె పాదాలను వెతుకుతుంది.. అలా చూస్తూ చేసే శక్తి లేక ధ్యానంలో కి వెళ్ళిపోయి ఉపాసన కొనసాగిస్తారు లేకుంటే భయంతో మైకం వచ్చి పడిపోతారు.. నిదానంగా అలవాటు అయిన కొద్దీ ఆ భయం తగ్గక పోయిన ధైర్యంతో సాధన కొనసాగించడం అలవాటు అవుతుంది.. క్రమంగా ఈ సాధన సమయం కూడా పెరుగుతుంది. అకండ దీపం లో అమ్మవారిని భావించి చేసే మండల దీక్షకు కూడా అంత శక్తి ఉంటుంది.
ఈ ఉపాసన అంతా తెలియక పోయినా ప్రాతః కాలం సూర్యోదయానికి పూర్వం ఎక్కడ దీపం వెలుగుతుందో ఆ ఇంటిని ఆ దీపం రూపములో అమ్మవారు రక్షిస్తుంది దీపానికి ఒక్కో సమయానికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు ఉదయం 5 గం దీపంలో వినాయకుడు అధిపతిగా ఉంటారు , 5.30 నుండి 6 గం సమయం వరకు లక్ష్మీ దేవి అధిపతిగా ఉంటుంది ఆ తల్లి దీపంలో కొలువై నరాయణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది ఎక్కడ లక్ష్మీ కొలువై స్వామిని ఆరాధిస్తారో ఆ ఇంటిపైన క్ నరాయణుడి దృష్టి పడుతుంది. అగ్ని రూపం సాక్షాత్తు అమ్మవారే ఆ అగ్నిని దీపం రూపంలో ఆరాధిస్తే అంతకంటే గొప్ప ఉపాసనా సాధన ఏముంటుంది.
ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి, అగ్నిహోత్రం అలవాటు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆ తల్లిని ప్రత్యక్షంగా ఆరాధించినట్టు..దీపాలు వెలిగించండి అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి..ఆ తల్లి మీ ఇంటికి దీపమై చీకటిని మాపి వెలుగును నింపుతుంది.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore