Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన -4

18.219.89.207

శ్రీ విద్యా ఉపాసన -4 

పరమానందం అనగా ఆత్మ మరియు పరమాత్మల కలయిక. ఇది ‘సౌ’ ను అనుసరించే ‘క్లీం’ బీజ మంత్రములను ఏకాగ్రతతోకూడిన శ్రద్ధాసహితముగా చేసే ఉచ్ఛారణద్వారా ఆత్మ మరియు పరమాత్మల కలయిక సాధ్య పడును. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, మరియు జ్ఞానశక్తి, మూడింటి కలయిక ఈ బీజమంత్ర ములు సాధ్యము చేయును. దీనినే మంత్రసిద్ధి అంటారు. మొక్కుబడిగా, యాంత్రికముగా, మరియు శ్రద్ధారహితముగా చేసే ఉచ్ఛారణ ద్వారా ఇది దుస్సాధ్యము. పరమాత్మను వదలి వివిధములయిన దేవతలను కొలవటము వృధా ప్రయాస. ప్రత్యాహారముద్వారా ఇంద్రియములనుండి శ్వాసను ఉప సంహరించ వలయును. ప్రాణాయామము ద్వారా చిత్త ఏకాగ్రత (one pointedness) తో ధారణ చేయ వలయును. దానిని ధ్యానము అందురు. అట్టి ధ్యానము ఒక్క క్షణమైనను సంతృప్తిని, మరియు దివ్యానుభవమును ఇచ్చును.

కోరికలు లేని సింహములాంటి అట్టి సాధకుడిని, ఏనుగులలాంటి ఇంద్రియ లక్ష్యములు చేతనారహితమవుతాయి. పారిపోతాయి. (నిర్వాసనం హరిం దృష్ట్వా తూష్ణిం విషయ దంతినః పలాయంతే న శక్తాస్తే సేవంతె కృతచాతవః --- XVIII).

పరమాత్మనే కోరుకో, ఆయనలోనే హృదయపూర్వకముగా లీనమవ్వు, అదే పరిపూర్ణ ఇంద్రియనిగ్రహము. మనస్సునుండి మొదలుపెట్టి ఇంద్రియములవరకు అన్నీ పరమచంచల మైనవే. ధ్యానముచేయని మనస్సు మరియు ఇంద్రియములు అత్యంత చంచలమయినవి. కాని ఎప్పుడయితే సాధకుడు పరమాత్మమీద పరిపూర్ణ దృష్టి పెడతాడో అప్పుడు పరమచంచలమయిన అవే మనస్సు మరియు ఇంద్రియ ములు మహా నిశ్చలమయినవిగా సాధకునికి తోడ్పడుతాయి. అందమయిన స్త్రీ పురుషుల పరస్పర ఆకర్షణ పరస్పర ఆరాధనగా మారుతుంది.

ఏకాగ్రతతో అమ్మ లేదా అంబను ధ్యానించ వలయును. సువర్ణ బంగారు చెవ్వు ఆభరణము, చేతి గాజులు, మరియు వడ్డాణము ధరించిన అమ్మ రూపము మీద, ఇంద్రియ వృత్తుల మీదను, కొంచెము సమయము అయినను, ధ్యానము చేసినట్టి సాధకుడు, శీఘ్రమే విశ్వచేతనలోకి వెళ్ళగలుగుతాడు. చెవ్వు ఆభరణము ‘అయిం’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ జ్ఞానశక్తికి ప్రతీక. చేతిగాజులు ‘క్లీం’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ క్రియాశక్తికి ప్రతీక. వడ్డాణము ‘సౌ’ బీజమంత్రమునకు ప్రతీక. ఇది అమ్మ ఇచ్ఛాశక్తికి ప్రతీక. 

శాస్త్రములు అమ్మ సాక్షాత్కారము కొరకై ఇంకను కొన్ని పద్ధతులనుకూడా సూచిస్తాయి. ఆమె రూపమును ధ్యానించటము, నెలవంక చంద్రునితో కూడిన అమ్మ కురులను ధ్యానించటము, నడుముకు రక్తవర్ణపు వస్త్రము ధరించి పుర్రెలు నెక్లస్ గా ధరించిన మెడను, వెల్లకిలా పడుకొనిఉన్న శివుడిమీద అమ్మ కాళీ కాళ్ళు పెట్టి నుంచోవటము, అంతేకాదు, నాలుగు చేతులు, మూడు కన్నులు, ఎత్తైన స్థనములు, కొంచెము వంచిన నడుము ఉన్న అమ్మను, అనగా మహాత్రిపుర సుందరిని, ధ్యానించటము, మొదలగునవి.
రక్తవర్ణపు వస్త్రము మహాత్రిపుర సుందరియొక్క సృష్టి శక్తిని, మరియుపుర్రెలు నెక్లస్ గా ధరించిన మెడ అహంకారరహిత అక్షరముల మాలను సూచిస్తాయి. ( సశేషం)

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha