Online Puja Services

పూజా విధానంలో అంతరార్థం

18.119.161.216
పూజా విధానంలోని, క్రియలలో అంతరార్థం.........!!
 
1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.(సహస్త్రరం చేరుకున్న కుండలిని కి గంటా నాదం వినపడుతుంది.. అది పరాశక్తి యొక్క చింతామణి గృహం అక్కడ చేరగానే గంటా నాదం వినడం అంటే జీవాత్మ పరమాత్మ లో ఐక్యం కావడం దానికి నిదర్శనగా గంటా నాదం గుడిలో పెడతారు, అక్కడ ఉన్న దేవుడు మన సహస్త్రరం లోనే ఉన్నాడు అని సంకేతం అందుకే దేవుడి ఎదురుగా ఉన్నపుడు కళ్ళు3 మూసుకుని ఆత్మ దర్శనము చేసుకుంటాము)
 
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. " స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి" అని.(జీవాత్మ జోతి రూపం లోనే ఉంటుంది , దీపం రూపంలో దైవం ప్రత్యక్షంగా కొలువై ఉంటుంది.. మనలోని కాంతి దీపం రూపంలోనే ప్రకాశిస్తుంది అన్నదానికి నిదర్శనమ్)
 
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.(ధ్యానంలో అధిక సమయం ఉండిపోయిన వారికి సమాధి స్థితిలో ఉన్నవారికి ఇహలోక సృహ తెప్పించ డానికి సాంబ్రాణి ధూపం వేస్తారు అది పీల్చగానే బాహ్య సృహ లోకి వస్తారు అలా కాకుండా బలవంతంగా ఎవరిని ధ్యానం నుండి మేలుకొలుప కూడదు, భగవంతుడు నిత్యం ధ్యాన లోనే ఉంటారు, పూజ సమయంలో ధూపం వేసి భగవంతుడు ని ధ్యానం నుండి మేలుకొని పూజని స్వీకరించమని కోరుకోవడం).
 
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. (సృష్టి మొత్తం అనంత వాయువులు కిలిసిపోయేదే, కర్తవ్యనిర్వాహణ తర్వాత కర్మ ఫలితం దైవానికి విడిచి పెట్టాలి కర్పూరం కరిగి నట్టు కర్మను కరిగించ మని దైవాన్ని ఆశ్రయించడం)
 
5. గంధపు సేవ
 
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం. (జీవిత పరిమళం ఆధ్యాత్మికత తోనే పరుమళిస్తుంది, ఎన్ని సమస్యలు ఉన్నా ఆధ్యాత్మిక చింతన పాచి గుంటలో తామర లాగా ప్రకాశిస్తుంది.. అటువంటి దైవసేవ చేస్తున్నాను నా జీవితాన్ని పరిమలింప చేయమని కోరుకోవడం)
 
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ( ఒక నిత్యా జీవితంలో భాగం కావడం రోజూ చేసే కర్మలతో నిత్యా పూజ తో కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపటం అంటే మీ సమయాన్ని దైవముతో గడపటం ఆలోచనలు ఆశలు అలవాట్లు పక్కన పెట్టి హృదయాన్ని నివేదన చేయడం పూజ)
 
7. పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు. (జీవాత్మ పరమాత్మ లో ఐక్యం కావడానికి దేహమే ఒక ఆధారంగా ఉపయోగ పడుతుంది, జీవము అనే ఈ చిలుక దేహము అనే గూటికి ఆధారంగా చేసుకుని సాధన చేస్తుంది ఇదే పత్రం , దైవాన్ని చేర్చే సారధి )
 
8. పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. (ఈ పుష్పమ్ రూపంలో హృదయాన్ని భగవంతుడు పాదాల దగ్గర సదా ఉంచాలి అంటే ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా దైవ నామ స్మరణ విడువ కూడదు దీన్నే హృదయ కమలాన్ని దైవానికి అర్పించడం అంటారు).
9. ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు. (దేవుడు ఇచ్చిన ఈ మానవ జన్మ గొప్ప ఫలం మళ్ళి తిరిగి జన్మ లేని ఫలం లభించాలి అంటే దైవాన్ని శరణు వేడుకోవాలి)
 
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి. (ఇది తర్పణము నిత్యా తర్పణము హృదయంతో చేయడం సర్వస్య శరణాగతి అంటే ఏది చేసినా దైవకార్యం అనుకోవడం అది భగవంతుడు కి సమర్పించడం.. దానివల్ల నీకు కర్మ బంధం నిండి విముక్తి పొందుతూ నీరు వదలడం).
 
11. కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. (భగవంతుడు పెట్టె పరీక్షలు కొబ్బరి చిప్ప లాగా కఠినంగానే ఉన్నా దాన్ని దాటుకుని వెళ్తే తీయటి కొబ్బరి నీరు ఉంటుంది, స్వచ్ఛమైన బొబ్బరి కొబ్బరి నీరు లాగా కఠినమైన పరీక్షలు వెనక శాశ్వతమైన ఆనందం ఉంటుంది). అటుఅటువంటి పరీక్షలను దాటించి చల్లని అనుగ్రహం తీర్థంగా ప్రసాదించ మని కోరుకోవడం.
 
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము. (నమస్కారం చేయడం అంటే వినయంతో దైవానికి మనస్ఫూర్తిగా శరణు వేసుకోవడం, నమస్కారం చేసే సమయంలో బొటన వ్రేలు బృకుటిని తకాలి ఆ భంగిమలో చేతి వ్రేలు నుండి ప్రకంపనలు బృకుటిని తగిలి విద్యత్కాంతి శక్తి మెదడుకి ప్రవహిస్తుంది అప్పుడు మెదడులోని నరాలు బలపడుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది.. అందుకే ఉదయం లేవగానే దేవుడికి , పూజ సమయంలో , బడిలో గురువుకి ఇలా నమస్కారం చేయమంటారు.)
 
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరమైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.( గుడిలో చేసే ప్రదర్శన వల్ల రాత్రంతా గుడిలో విగ్రహం కింద ఉన్న యంత్రం విశ్వప్రాణ శక్తిని ఆకర్షిస్తుంది ప్రదర్శన సమయంలో అది మన శరీరాలను తాకడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే గృహంలో ఆత్మ ప్రదర్శన నమస్కారం చేయాలి అంటే ఈ విశ్వం ఆ పరమాత్మ అంతా తనలోనే ఉన్నదని ఆత్మ రూపంలో పరమాత్మను గుర్తిస్తున్నాము అని నమస్కరించి ప్రదర్శన చేయడం.)గుడిలో ఎప్పుడూ తమ చుట్టూ తాము తిరగకూడదు గుడిలో గుడి చుట్టూ మటుకే తిరగాలి ఇంట్లో పూజ సమయంలోనే తమ చుట్టూ తాము తిరగాలి.
 
14. అష్టాoగ నమస్కారం ఇది పురుషులు మటుకే పూర్తిగా బోర్ల పొడుకుని నమస్కారం చేయాలి మనసా వాచ కర్మణా సదా నీకు దాసుడనై భక్తుడునై నిన్నే ఆశ్రయించి ఉంటాను అని భావము.
 
ఈ పూజలు కట్టుబాట్లు దీక్షలు, ఆచారాలు మానవ జీవితాన్ని క్రమశిక్షణ తో గడపటానికే, ప్రతి ఆచారంలోను సాంకేతిక మైన లాభాలతో పూర్వీకులు నియమించారు, పెట్టే ప్రసాదాల నుండి ఆచరించే పద్ధతుల వరకు అన్నిటా ప్రయోజనమైన ఉపయోగలే ఉన్నాయి.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore