శ్రీ విద్యా ఉపాసన -8
శ్రీ విద్యా ఉపాసన -8
నహి వర్ణవిభేదేన దేహభేదేన వా భవేత్
పరత్వం నిష్కళత్వేన సకళత్వేన తద్భవేత్
కళాధ్వ లేక దేశధ్వలతో పరాస్థితి స్థిరముగా ఉండదు. పరాస్థితి అనేది అబేధస్థితి. ఆ అబేధస్థితి సకల లేక మిశ్రమ స్థితులతో కలిసి ఉండలేదు.
కనుక అనేకమును (కళాధ్వ లేక పురుష మరియు దేశధ్వ లేక శక్తి) ఒక్కటి అనగా పరాశక్తి లేక పరబ్రహ్మంగా చేసికోవటములోనే ఈ బంధమునుండి విముక్తి కలుగును.
త్రైపుర సిద్ధాంతములో, ముఖ్య శక్తి మూడుగా అనగా
వ్యష్టి (విభావ)వ్యక్తీకరణ
సమిష్టి (ప్రభావ)వ్యక్తీకరణ, మరియు
ఒప్పుకోలు(అనుభవ)వ్యక్తీకరణగా మారుతుంది.
త్రిపురములలో నివసించేదే ముఖ్యశక్తి లేక పరాశక్తి. దానినే శ్రీ త్రిపుర అంటారు. శ్రీ త్రిపుర లేక శ్రీ త్రిపురసుందరి అమ్మ
బ్రహ్మ విష్ణు రుద్ర లేక అగ్ని వాయు సూర్య లేక వసు రుద్ర ఆదిత్య లకి అతీతమయినది.
ఆహావనీయాగ్ని అనగా యాగాగ్ని,
గార్హపత్యాగ్ని అనగా గృహము లోని అగ్ని,
దక్షిణాగ్ని అనగా శరీర దహనాగ్ని,
అనే మూడు అగ్నిలు వ్యక్తి జీవితములో, జననము నుండి మరణము వరకు, ముఖ్యమయినవి.
యోగి జీవితములో ఆహావనీయాగ్ని హృదయమునకు సంబంధించినది. గార్హపత్యాగ్ని ఫాలభాగమునకు (కూటస్థము) సంబంధించినది.
దక్షిణాగ్ని శిరస్సునకు సంబంధించినది.
మూడు శక్తులు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, మరియు జ్ఞానశక్తి.
ఇవి నిజానికి బ్రాహ్మి, రౌద్రి, మరియు వైష్ణవి శక్తులు. ఇవ్వి శ్రీదేవి యొక్క మూడు ముఖ్య శక్తులు. ఇవ్వి ఈ జగత్తు యొక్క వ్యక్తీకరణకు తోడ్పడుతవి. ప్రతి అణువులోను ఈ మూడు ముఖ్య శక్తులున్ను పనిచేస్తూ ఉంటాయి.
మూడు స్వరములు:
ఉదాత్త—అనుదాత్త—స్వరిత అనేవి వేదిక మంత్రము(ల) ఉచ్ఛారణ పద్ధతులు.
హ్రస్వ, దీర్ఘ, మరియు ప్లుత అనే అకార – ఉకార – మకార ఓంకార ఉచ్ఛారణా పద్ధతులు.
మూడు కూటములు (గాయత్రి, బాల, లేక పంచదశి లేక షోడసి).
అవి: వాగ్భావ, కామరాజ, మరియు శక్తి కూటములు.
మూడు లోకములు: అవ్వి--
భూ – పృథ్వీ, భువః – ఆకాశము, మరియు స్వః – స్వర్గము.
మూడు చక్రములు: మూలాధార – అనాహత – ఆజ్ఞా
విజ్ఞులు ఈ మూడింటి మీద ఆధారపడుతారు. ప్రమాత (అధికారత), ప్రమాణ (సాక్ష్యము), మరియు ప్రమేయ (సిద్ధాంతము).
మూడు పీఠములు: జలంధర, కామరూప, మరియు పూర్ణగిరి
మూడు పవిత్ర తీర్థములు: నాసిక్, పుష్కర, మరియు ప్రయాగ.
జగత్తును శాసించే శక్తులు:
ఓం – తత్ – సత్ -- వేదముల ప్రకారము
నర – శివ – శక్తి --- తంత్ర ప్రకారము
జీవ – జగత్ – ఈశ్వర – వేదాంతం ప్రకారము
ఇడ – సుషుమ్న – పింగళ – కుండలినీ యోగము ప్రకారము
భూత – వర్తమానము – భవిష్యత్ — మూడు కాలములు
హృదయ – వ్యోమ – బ్రహ్మరంధ్ర — మూడు రంధ్రములు
బ్రహ్మ – క్షత్రియ – వైశ్య అని మూడు వర్ణములు.
ఋగ్ – యజుస్ – సామ అని మూడు వేదములు.
అంబ మనకు అనేక రూపములలోను, మరియు వ్యక్తీకరణలలోను దర్శనము ఇస్తుంది.
ఆవిడను శ్రీలక్ష్మి రూపములో దర్శిస్తే మనము భౌగోళికము అయిన కష్టములను అధిగమించవచ్చు. (సశేషం)