శ్రీ విద్యా ఉపాసన - 7
శ్రీ విద్యా ఉపాసన - 7
ప్రతి సమూహములోని (group) మూడు అధ్వలు కూడా పరాదశ (అత్యుత్తమ మైన దివ్యశక్తి) లోని పశ్యంతి, మధ్యమ, మరియు వైఖరీ స్థితులుగా అర్థము చేసికొనవలయును.
శుద్ధసృష్టి లోని శబ్దముయొక్క అయిదు వర్గములు (categories) అయిదు దశలుగా అర్థము చేసికొనవలయును. మొదటిది పర, సూక్ష్మము మరియు అత్యుత్తమము. రెండవది పశ్యంతి, తక్కువ సూక్ష్మము కాని ఇంకా వేరుచేయ బడలేదు(undifferentiated) లేదా వ్యక్తీకరించలేదు. మూడవది మధ్యమ, స్థూలము మరియు వేరుపరచబడినది కాని ఇంకా స్పష్ఠత చేకూర్చుకోలేదు. స్పష్ఠత చేకూర్చుకున్న శబ్దము వైఖరీ. ఇది సూక్ష్మము మరియు స్థూలము అని రెండు రకములు.
వైఖరీనుండే వర్ణములు మరియు సంయుక్తాక్షరములు లేక పదములు మరియు వాక్యములు వ్యక్తీకరించినవి.
పర అనేది శివ తత్వములో ఉండును. అది శబ్దమునకు మొట్టమొదటి ఉద్యమము. దీనిని నాద తత్వము అంటారు.
పశ్యంతి శక్తితత్వమునకు ప్రతీక. దీనిని బిందు తత్వము అంటారు. సృష్టి యొక్క అత్యద్భుత శక్తి ఇదే.ఈ మూడింటినుండి త్రిబిందు ఉద్భవించినది. అదే అన్ని మంత్రములకు మూలము. సూక్ష్మమయిన మరియు గూఢమయిన కామకళ కారకము, సమర్ధమయిన దేశికనుండి నేర్చుకోవలయును.
అమ్మలగన్న అమ్మ తనను తాను ప్రకాశమురూపముగా దర్శనము ఇచ్చినప్పుడు ప్రతి జీవుడి లోని ద్వంద్వమునకు హేతువు తన ఉనికిని పోగొట్టుకుంటుంది. దేశములోని మరియు మనలోని ప్రతిఒక్కరము ఆ మంత్రశక్తి యొక్క రూపాంతరముగా అవుతాము. మనలోని శ్వాస నిశ్చలము అగును.
మనస్సు మరియు ఇంద్రియములు అంతర్ముఖము అగును. మన శరీర చేతన ఉండదు. ద్వైతరహితులము అవుతాము. సర్వమానవ సౌభ్రాతృ త్వమును స్వాదిస్తాము. అప్పుడు శివ-శక్తిలతో ఐక్యభావము చెందుతాము. ఈ ఐక్యభావమే పరబ్రహ్మన్ అని మహాత్రిపురసుందరి అని గ్రహిస్తాము.
షఢధ్వములు మూడు స్థితులలో వాటి పేర్లు ఈ క్రింద విధముగా ఉండును. అవి:
వాచకధ్వ (శబ్ద) > వాచ్యధ్వ (అర్థ) > వాటికి సంబంధించిన మూడు స్థితులలో నామములు:
వర్ణధ్వ అనగా అక్షరముల మార్గము.
కళాధ్వ అనగా అయిదు సరిహద్దులతో కూడుకొనియున్నది. అవి - శంత్యతిత కళ (శివతత్వ), శంతకళ (శక్తి లేక శుద్ధ విద్య), విద్యాకళ (మాయ - పురుషుడు), ప్రతిష్ఠాకళ (ప్రకృతి - జల), మరియు నివృత్తికళ (పరా మరియు పశ్యంతి--పృథ్వీ) .
పదాధ్వ అనగా పదములు మరియు అక్షరములతో కూడుకొనియున్నది.
తత్వధ్వ (36 తత్వములతో కూడుకొనియున్న పరిపూర్ణ వ్యవస్థ) —పరాపర లేక మధ్యమ.
మంత్రాధ్వ అనగా మంత్రములతో లేక మహావాక్యములతో కూడుకొని యున్నది.
భువనాధ్వ అనగా తంత్రశాస్త్రము ప్రకారము 118 కూడుకొని యున్నది—అపరా లేక స్థూల వైఖరి.
పరా వాక్, శబ్ద లేక పదము, మరియు అర్థము అనేవి విడదీయలేని ఒక బంధము. వ్యక్తీకరణ జరిగినప్పుడు ఇవి వేరుబడటము ప్రారంభము అవుతాయి. ఈ సృజనాత్మక సంతతి(descent)లో ధృవణత (polarity) ఉంటుంది. అనగా విషయము మరియు వస్తువు ఉంటాయి. విషయము అనగా చేసే వ్యక్తి(subject), వస్తువు అనగా లక్ష్యము(object).
ఉదా: రాముడు వేదము చదివెను. ఇక్కడ రాముడు వ్యక్తి, వేదము చదివెను అనేది లక్ష్యము. ఈ సృజనాత్మకలో ఉత్కృష్టమైన అనగా అత్యంత సూక్ష్మ మయినది పరా. అది స్థూలమయిన వైఖరీకి దారితీస్తుంది.
శబ్దాధ్వ అనగా ఆఖరికి పరా లేక పరాశక్తి స్థితిలోకి చేరటము, తద్వారా అమ్మ
దయతో ఆమెని పొందటము. లేనియడల తిరిగి సంసారబంధములో చిక్కు
కుంటాము. భైరవ శ్రీదేవి సంభాషణలో ఇది తేటతెల్లము అవుతుంది. (సశేషం)