Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన -6

18.219.89.207

శ్రీ విద్యా ఉపాసన -6 

అమ్మవారికిచ్చే నైవేద్యములు లేదా పూజాపద్ధతులలో ఫలాపేక్ష ఉండకూడదు. ప్రతి కార్యబీజము తగిన ఫలితమును తప్పక ఇచ్చును. కనుక ఫలితము ఆశించకూడదు. దాని ప్రభావము తగ్గుతుంది. ఫలితము ఆశించి చేసిన పనులు ఫలితమునివ్వకపోవడము లేదా పూర్ణఫలితమును ఇవ్వకపోవడము జరుగును. 

మనము చేసేపనులు, పూజలు, ధ్యానము అసహనముగా చేయకూడదు. అప్పుడు ఎకువెక్కువ పనిచేయ లేము. అందుకనే భగవంతుడు అర్జునుడితో నిష్కామకర్మను అనుసరించమన్నాడు. అది మనస్సుకు స్వచ్ఛతను ఇస్తుంది. అది ఆత్మస్వతంత్రతకు, మరియు సరియిన ప్రార్థనకు దారితీస్తుంది. 

పూజ నామ న పుష్పాద్యైర్య మతిః క్రియతే ద్రుధా
నిర్వికల్పే మహావ్యోమ్ని సా పూజా హ్యాదరాళ్యః 
పూజ అనగా కేవలము పుష్పములు అర్పించుటయేగాదు. పూజ అనగా తన హృదయమును ఆలోచనారహితముగా భగవంతునికి అర్పితము చేయటము. అది తీవ్ర ఆవేదనతో తననుతాను భగవంతునికి అర్పించుకోవటమే.

నిశ్చితమయిన మనస్సులోని కోరిక ప్రారబ్ధకర్మనుకూడా దూరము చేయ గలదు. ఇది శూన్యమయిన అనుభవములకంటే శ్రేష్టమయినది. ఆ కోరిక తన అసలు రూపమును అనగా సత్య స్వరూపమును తెలిసికోవటము, లేదా పరి పూర్ణతకు, అటుపిమ్మట అది శరీరబానిసత్వమునుండి విముక్తికి దారితీస్తుంది. ఆ కోరిక ఆత్మను మరియు ప్రపంచమును ఉన్నతస్థితి చేరుటకు తోడ్పడుతుంది. శుద్ధబుద్ధి ఉన్న వ్యక్తి మాత్రమె ఈ స్థితిని చేరగలడు.

యం యం లోకం మనసా సంవిభాతి విశుద్ధసత్వః కామయతే
యామ్శ్చ కామాన్ తం తం లోకం జాయతే తామ్శ్చ కామాన్ 

ముండక – ఉపనిషద్ III-1-30.
శుద్ధమనస్సుగల వ్యక్తి తను మానసికముగా అభిలషించిన న్యాయపూరిత మయిన కోరుకున్న వస్తువులను పొందగలడు. 

మాతృక శక్తి నుండి ఉదయించిన కార్య కారణ సంబంధముతో కూడినదే ఈ జగత్తు. ఇది పరావాక్ యొక్క విస్తరణయే. ఈ విస్తరణ షఢధ్వ అనే ఆరు మార్గముల ద్వారా జరుగుతుంది. వీటిలో మూడు వాచ్యము వైపు, మిగిలిన మూడు వాచకము వైపు ఉంటాయి. 

వాచకము వైపు ఉన్న త్రయమును కళధ్వ లేదా లౌకిక క్రమము అని, వాచ్యము వైపు ఉన్న త్రయమును దేశధ్వ లేదా ప్రాదేశిక క్రమము అని అంటారు. (సశేషం).

Quote of the day

No one saves us but ourselves. No one can and no one may. We ourselves must walk the path.…

__________Gautam Buddha