గాజులు సౌభాగ్యానికి చిహ్నం
శ్రీ మాత్రే నమః
గాజులు అందానికే కాదు... సౌభాగ్యానికి చిహ్నం...
గాజులు తమ రంగును బట్టి రకరకాల అర్థాలని తెలియజేస్తాయి..
ఎరుపురంగు గాజులు శక్తిని..
నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని..
ఉదారంగు గాజులు స్వేచ్ఛ ని..
ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని..
పసుపు రంగు గాజులు సంతోషాన్ని..
నారింజ రంగు గాజులు విజయాన్ని.. తెల్లరంగు గాజులు ప్రశాంతతని..
నలుపురంగు గాజులు అధికారాన్ని..
ఇలా మట్టిగాజులు ఎంతో ప్రత్యేకత,విశిష్టత ఉంది మన సాంప్రదాయం లో స్త్రీ వేసుకునేమట్టిగాజులకి..
అందుకే సుమంగళి స్త్రీ లు తప్పనిసరిగా ధరిస్తారు.
ధనవంతులు రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా... ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టిగాజులు ధరించాలని శాస్రం చెబుతుంది.
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు, కుంకుమ తో పాటు గాజులు పెట్టి పూజించడం మన సాంప్రదాయం, ఆచారం.
ముతైదువులకి గాజులు ఇచ్చి గౌరవించే సాంప్రదాయం మనది.
స్త్రీ వేసుకునే గాజులకి ఇంత విశిష్టత వుంది.