Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన -3

18.223.206.84
శ్రీ విద్యా ఉపాసన -3
ఒక్కొక్కప్పుడు ఆ అమ్మ దయ హఠాత్తుగా లభిస్తుంది. గొప్ప గురువులు అటువంటి సందర్భములను అనుభవించారు.
సంచిత కర్మలకి ప్రారబ్ధ కర్మలకి సంతులనం ఏర్పడినప్పుడు అమ్మ దయ హఠాత్తుగా లభిస్తుంది. దీనినే కర్మసామ్య అంటారు.
అమ్మదయ సాధారణ వ్యక్తులకుకూడా లభ్యమగును ఒక్కొక్కప్పుడు. అది ఒక అద్భుతము. అది మన తార్కికతకు అతీతము. అమ్మ మహా త్రిపుర సుందరి దయ అనేది నియమములకు అతీతము. ఏ మానవశక్తి అమ్మ దయ ముందర సూరీడిముందర దీపము మాదిరి దిగదిడుపే. (నత్వత్రకో ఆపి అత్మియోపురుషాకారః –ఈశ్వర ప్రత్యభిజ్ఞ వృత్తి VI.7).
బిందు అనగా చుక్క. దీనినే అనుస్వరం అంటారు. ఈ మంత్రము అయినా బిందువులేకుండా ఉచ్చారణ చేయకూడదు. అట్లా చేసినయడల మంత్రము యొక్క శక్తి విహీనమవుతుంది. బీజాక్షరము చివర బిందువును చేర్చి ఉచ్చారణ చేసినయడల అద్వైత పరబ్రహ్మమును సూచిస్తుంది. సాధనలో మంత్రజపం మరియు బీజాక్షరజపం అతిముఖ్యమయినది. దానిద్వారానే అమ్మ దర్శనము సాధ్యము.
ఇక్కడ పరాశక్తి యొక్క దయగురించి ఒక కథ చెప్పుకుందాము. ఉతత్య అని ఒక బ్రాహ్మణ బాలకుడు ఉండేవాడు. వాడు చదువురాని మొద్దు(dunce). వాడికి ఏ మంత్రము సాధనా తెలియదు. తల్లిదండ్రులు వాడిని ఎప్పుడూ హేళన చెస్తూఉండేవారు. ఆ హేళన భరించలేక ఊరికి, మరియు తల్లిదండ్రులకు దూరముగా గంగానదీ తీరమున పవిత్రముగా సదా సత్యము పలుకుతూ ఒక గుడిసెలో జీవిస్తూ ఉండేవాడు. అందువలన ఆయనని సత్యవ్రతుడు అని పిలిచేవారు. ఒక రోజున బాణములతో గాయపడిన అడవిపంది ఆయన గుడిసె వెనకాల చెట్లల్లో దాక్కున్నది. భయముతో సత్యవ్రతుడు ‘అయి అయి’ అని అరిచాడు. ఇంతలోకే దాన్ని తరుముకుంటూ వెనకాల వచ్చిన ఒక వేటగాడు ‘అడవిపంది’ జాడ చెప్పమని అడుగుతాడు. ‘అయి అయి’ లో బిందువుతో లేకపోయినప్పటికీ అమ్మ ఆయన మీద దయ చూపించింది. ఆయనలో తెలివితేటలు పొడసూపినవి. ‘హింస’తో కూడినది ‘సత్యము’ కాదు, ‘దయ’తో కూడిన ‘అసత్యమేధర్మము ’ అని తెలిసి సత్యవ్రతుడు ‘ఓ వేటగాడా, ‘చూసే కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు’. దానికి ఆ వేటగాడు వీడెవడో పిచ్చివాడిలాగా ఉన్నాడని వెళ్లిపోతాడు.
సత్యం న సత్యం ఖలు యత్రా హింసా దయాన్వితం చాన్రితమేవ సత్యం
హితం నరాణాం భవైత్య యేన తదేవ సత్యం న తథాన్యథైవ
(దేవీ భాగవతం3.11.36)
నిప్పును తెలిసి ముట్టుకున్నా, తెలయక ముట్టుకున్నా కాలుతుంది.
అనిచ్ఛయఅపిసంస్పృష్తో దహత్యేవ చ పావకః (అష్టావక్రగీత XVIII.37).
అమ్మ భూత వర్తమాన మరియు భవిష్యత్ కాలాలకు అతీతురాలు. అందువలన అమ్మ నిత్యం.
ప్రమాత, ప్రమాణ, ప్రమేయరూపా సృష్టిః.
పరమాత్మ చేతన ఏ విధముగానూ ప్రభావితము అవ్వదు. పరాశక్తి హఠాత్తుగా వేలకొద్ది మనుష్యులలో ఒక్కడికి అమ్మ దర్శనము ఇస్తుంది. అది కేవలము అమ్మ దయ మాత్రమె. దీనినే శక్తిపాతము అంటారు. అది సత్యవ్రతుడికి శక్తిపాతము రూపములో హఠాత్తుగా అమ్మ దర్శనము లభ్యమయినది.
ఓం అనేది ప్రణవ నాదము. అది పరమాత్మను గుర్తించుటకు ఏర్పడినడి. అందువలన ప్రణవ నాదము నమస్కారము లేదా గౌరవమునకు అర్హత పొందదగినది. అదే నమ్మకముతో ‘క్లీం’ అనే మంత్రమును విజ్ఞలు ధ్యానిస్తారు. ఏ పూజ అయినను భక్తితో శ్రద్ధతోను ఓం శబ్దముతోనే మొదలు అవ్వుతుంది, ఓం శబ్దము తోనే సమాప్తి అవ్వుతుంది. ఈ ప్రణవ నాదము యెంతో పవిత్రమయినది. సాధకుడికి ఈ పవిత్ర శబ్ద ఉచ్ఛారణములే శ్వాస నిశ్వాసములు, శక్తిపాతము కలుగజేస్తుంది. పరమాత్మకి శ్రద్ధతో తనను తాను అర్పించుకొన్న సాధకునికి మనస్సు స్థిరము అవుతుంది.
ఆశయరహితము, మరియు అహంకారరహితములేని భక్తి వ్యర్థము. మన మనస్సు సగుణ లేదా రూపసహిత దేవుడ్ని గుర్తించగలదు. భగవద్భక్తి సాధకుడి అహంకారరహితుడ్ని చేసి సమాజసేవను వృద్ధి చేస్తుంది. ఈశ్వరుడు సర్వజగత్తుకు నాయకుడు. మనము ప్రకృతి దాటి వెళ్తేకాని పరమాత్మ అర్థము కాడు(దు).
కార్యకలాపాలు, మరియు ఇచ్ఛాశక్తితో కలిసిన జ్ఞానదేవత సరస్వతి. ఆ అమ్మ దయ చూపించినప్పుడు, శాంతి, ప్రశాంతత, మరియు పరిపూర్ణతతో కూడిన ముక్తియొక్క ఆనందమును అనుభవిస్తాడు సాధకుడు. దివ్యత్వము పొందిన విజ్ఞులయిన సాధకులు దానిని తమ కవిత ద్వారా ఆమె దయ ఇత్యాది గుణములను ఆనందముగా తెలియబరుస్తారు.
శ్రేష్టమయిన మూడు బీజాక్షరములు కలిసిన మంత్రము నిర్గుణసమాధి కొరకై ఉచ్ఛరించవలయును. అదే ఆ + ఉ + మ్ = ఓం. ఈ ‘ఓం ‘ ఉచ్ఛారణ సాధనకు పరిపూర్ణతను ఇస్తుంది. కార్యకలాపాలు, మరియు ఇచ్ఛాశక్తిని అధిగమించి, జ్ఞానము శ్రేష్టము అని సాధకుడు తెలిసి కుంటాడు. ఈ జ్ఞానము పరమాత్మతో తనను కలుపుతుంది అని అర్థము చేసికుంటాడు సాధకుడు.
(జ్ఞానాత్ ఏవతు కైవల్యం).
ఏ సాధనా పద్ధతులు అనుసరిస్తున్నవాడు అయినప్పటికీ, సాధకుడు ఈ క్రింది బీజాక్షరములను శ్రద్ధతో ఉచ్ఛారణ చేసిన లాభము చేకూరును.
1. అయిం సౌ
2. అయి ఇ ఔ
3. సౌ క్లీం అయిం
4. అయిం క్లీం సౌ
అమ్మ శ్రీదేవియే ప్రణాళికలను అమలుపరచి మనలను ఆనంద పరచేది. శ్రీదేవియే శక్తి. అమ్మయే పరమాత్ముడైన శివునియొక్క విడదీయలేని శక్తి. ఆ అమ్మయే ఈ కనబడు జగత్తుకు ఆనంద కారణము. చిత్శక్తి తన తెరమీద జగత్తును తన ఇచ్ఛాశక్తితో ఆవిష్కరిస్తుంది. (స్వీచయా స్వభిత్తౌ విశ్వమున్మిల్యతి). అమ్మ తన భక్తుని న్యాయపూరితమయిన కోరికలన్నీ తీరుస్తుంది. ఆగమాలలో చెప్పిన కొన్ని పద్ధతులను ఇక్కడ చూద్దాము.
అవి:
1)అంగ, కర న్యాసములు చేయటము మరియు ఋషిని అనుసరించటము
2) శ్రీ గురు పాదుకలను జ్ఞాపకము చేసికోవటము,
3) వెతుక్కోకుండానే వచ్చేది.
వీటినే అనవోపాయ, శాక్తోపాయ, మరియు శాంభవోపాయ అంటారు.
అమ్మయొక్క స్వభావసిద్ధమయిన స్వరూప స్థితిని పరాభట్టారిక మహాత్రిపుర సుందరి అంటారు. అవి: 1) సకల, 2)నిష్కల, మరియు 3) నిష్కల సకల.
స్వయం ప్రకాశితురాలయిన అమ్మను పరాశక్తి అంటారు. (అంబ తే పరిపూర్ణ్యం స్వాత్మస్ఫురత్తయా విశ్వం పరామ్రిషత్యాంబా). అమ్మయే సృష్టికర్త.
అమ్మ బాలను శారద, వాగేశ్వరి, మహావిద్య, బ్రహ్మి, సరస్వతి, మరియు శ్రీదేవి, అనే వివిధ మయిన నామములతో ఆరాధిస్తారు.
అమ్మ మూడురకములయిన మలదోషములను నివారిస్తుంది. శబ్దబ్రహ్మ రూపిణి అమ్మ అన్ని అక్షరములకు అధికారిణి. ‘అ’ నుండి ‘క్ష’ వరకు ఉన్న అక్షరములను అక్షమాల లేక అక్షరమాల లేక అక్షమాల అంటారు. అమ్మ అక్షమాలను ధరిస్తుంది. ఈ అక్షమాలనే మాతృకచక్ర అనికూడా అంటారు. జపము మరియు సాధనకు ఉపయోగించే ఈ మాతృకమాలను గురించి వివరముగా కాళీతంత్ర మరియు శ్రీకులార్ణవలో వివరించారు.
పరిపూర్ణతతో కూడిన భక్తిభావము వెలువడినప్పుడే శక్తి పాతము( transfer of energy) అనగా శక్తి అమ్మనుండి బేషరతుగా సాధకునికి చేరుతుంది.
శక్తి పాతము( transfer of energy) తొమ్మిది విధములు అని తంత్రలోకములో చెప్పబడినది. పరాశక్తి పరమ దయాళు. ఆవిడ నాలుగు చేతులు ఆవిడ అనంతమయిన శక్తిని తెలియబరుస్తుంది. (సశేషం)

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore